Advertisementt

విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ రుద్రంకోట‌

Thu 07th Sep 2023 02:38 PM
rudramkota  విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ రుద్రంకోట‌
Rudramkota is all set for a grand worldwide release విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ రుద్రంకోట‌
Advertisement
Ads by CJ

సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హిరిస్తూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం రుద్రంకోట‌.  ఏఆర్ కె విజువ‌ల్స్ ప‌తాకంపై  రాము కోన ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  అనిల్‌, విభీష, రియా  హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.  ఇటీవ‌ల  సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం  సెప్టెంబ‌ర్ 22న   స్క్రీన్ మాక్స్ పిక్చ‌ర్స్  సంస్థ ద్వారా వ‌ర‌ల్డ్ వైడ్ గా  గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఈ సంద‌ర్భంగా హీరో, నిర్మాత  అనిల్ ఆర్క కండ‌వ‌ల్లి మాట్లాడుతూ... శ్మ‌శాన వాటిక‌లో పెరిగి పెద్దైన ఓ యుకుడి ప్రేమ‌కథా చిత్ర‌మిది. భ‌ద్రాచలం ద‌గ్గ‌ర రుద్రంకోట అనే ఊరి నేప‌థ్యంలో క‌థ న‌డుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చూపించ‌ని అంశాల‌ను మా చిత్రంలో చూపిస్తున్నాము. ఇందులో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే అంశాలుంటాయి.  సీనియ‌ర్ న‌టి జ‌య‌లలిత గారు స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హరిస్తూ ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు.  ప్ర‌ముఖ  సంగీత ద‌ర్శ‌కులు కోటి గారు మా చిత్రానికి అద్భుత‌మైన  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. సుభాష్ ఆనంద్ అందించిన రెండు పాట‌లు  ఇప్ప‌టికే విడుద‌లై  ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. ఇటీవ‌ల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ ప్ర‌ముఖులు యుబైఏ స‌ర్టిఫికెట్ తో పాటు సినిమా బావుందంటూ ప్ర‌శంసించారు. మా సినిమా న‌చ్చ‌డంతో  స్క్రీన్ మాక్స్ పిక్చ‌ర్స్  వారు  విడుద‌ల చేయ‌డానికి ముందుకొచ్చారు.  సెప్టెంబ‌ర్ 22న వ‌ర‌ల్డ్ వైడ్ గా  సినిమాను గ్రాండ్ గా విడుద‌ల చేయ‌నున్నాం అన్నారు.

Rudramkota is all set for a grand worldwide release:

Rudramkota is all set for a grand worldwide release on September 22

Tags:   RUDRAMKOTA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ