Advertisementt

కాస్త వెనక్కి జరిగిన రామ్ స్కంద

Wed 06th Sep 2023 03:26 PM
skanda  కాస్త వెనక్కి జరిగిన రామ్ స్కంద
Skanda Releasing On September 28th కాస్త వెనక్కి జరిగిన రామ్ స్కంద
Advertisement
Ads by CJ

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్కంద-ది ఎటాకర్. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కోసం బెస్ట్ డేట్ ని లాక్ చేశారు. డెడ్లీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ క్రేజీయస్ట్ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది.

స్కంద గురువారం విడుదల కానుంది కాబట్టి లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ వుంటుంది. ఆ తర్వాత సోమవారం (గాంధీ జయంతి) సెలవు. దసరా సెలవులు కూడా కలిసిరాబోతున్నాయి. ఈ రకంగా ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్ కి ఇది పర్ఫెక్ట్ డేట్. రిలీజ్ డేట్ పోస్టర్‌ లో రామ్, శ్రీలీల అందమైన చిరునవ్వులు చిందిస్తున్నారు. పంచెకట్టులో రామ్ చాలా కూల్‌గా కనిపిస్తుండగా,  శ్రీలీల గాగ్రా చోళీలో చాలా అందంగా కనిపిస్తోంది. ఇద్దరూ ఆహ్లాదకరమైన చిరునవ్వుతో కనిపిస్తున్నారు.

ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్‌లకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్‌ విడుదలయ్యాక క్రేజ్‌ మరింత పెరిగింది.

స్కంద రామ్ కి మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ సినిమా. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో కూడా రికార్డ్ సృష్టించింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించగా, సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్.  

స్కంద తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది.  

Skanda Releasing On September 28th:

Ram Skanda Releasing On September 28th

Tags:   SKANDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ