డైనమిక్ హీరో విశ్వక్ సేన్ హోస్ట్‌గా రాబోతున్న కొత్త షో ఫ్యామిలీ ధమాకా. ఈ షో ఆహ లో రాబోతుంది. ఈ షో ద్వారా OTT ప్రపంచంలోకి విశ్వక్ సేన్ అడుగుబెటపోతున్నారు. మరియు, ఈ షో తోటి ప్రేక్షకులని అలరించబోతున్నారు ఆహ మరియు విశ్వక్ సేన్.
ఫ్యామిలీ ధమాకా సెప్టెంబర్ 8న రాత్రి 8 గంటలకు ప్రీమియర్ ప్రారంభం అవుతుంది. ఇది ప్రేక్షకులకు మరియు కుటుంబ మొత్తానికి వినోదాన్ని అందిస్తుంది. అయితే, ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్‌లు కోసం సెప్టెంబరు 7న మొదటి ఎపిసోడ్‌ని అందిస్తున్నారు ఆహా.
ఆహా గోల్డ్, కేవలం రూ. 899కి అందుబాటులో ఉంది, 4K డాల్బీ ఆడియో, యాడ్-ఫ్రీ స్ట్రీమింగ్ మరియు తెలుగు మరియు తమిళ ప్లాట్‌ఫారమ్‌లకు ఒక సంవత్సరం యాక్సెస్ పొందే అవకాషాన్ని అందిస్తుంది.
ఈ షో యొక్క ప్రీ లాంచ్ ఈవెంట్ మన కాకినాడలోని SRMT INOX మాల్‌లో జరిగింది. కాకినాడలోని కుటుంబాలతో కలిసి ఆహ ఫ్యామిలీ ధమాకా గేమ్ ఆడించారు.
ఆ తర్వాత షో యొక్క ఆకట్టుకునే థీమ్ సాంగ్ మీద అందరు డాన్స్ చేయగా, ఈ ఈవెంట్ అద్భుతమైన విజయాన్ని సాధించింది మరియు రాబోయే వాటికి వేదికగా నిలిచింది అని నిర్వహకులు తెలిపారు.