Advertisementt

YSR వర్ధంతి సందర్భంగా వ్యూహం తొలిపాట

Sat 02nd Sep 2023 08:44 PM
vyooham song  YSR వర్ధంతి సందర్భంగా వ్యూహం తొలిపాట
Vyooham Movie 1st song Release YSR వర్ధంతి సందర్భంగా వ్యూహం తొలిపాట
Advertisement
Ads by CJ

పులుల వేషంలో గుంటనక్కలు, నిక్కబొడిచి ఆడుతున్న రాజకీయ వ్యూహం అనే లైన్లతో ప్రారంభమయ్యే వ్యూహం సినిమాలోని తొలిపాటను ఈ రోజు విడుదల చేశారు ఆర్జీవి అండ్‌ టీమ్‌. ఆర్జీవి డెన్‌ స్టూడియోస్‌తో కలసి నిర్మాత రామదూత క్రియేషన్స్‌ అధినేత దాసరి కిరణ్‌ కుమార్‌ వ్యూహం సినిమా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 2వతేది స్వర్గీయ వై.యస్‌ రాజశేఖర్‌ రెడ్డి భౌతికంగా భువిని విడిచి వెళ్లిన రోజని తెలుగు ప్రజలందరికి తెలుసు. ఆ రోజున ప్రపంచం అంతా దిగ్భ్రాంతికి గురైంది. శత్రువులు కూడా అయ్యే పాపం అని విలవిలలాడిన రోజది. ఆ రోజునుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన రాజకీయ చదరంగ మారణ హోమాన్ని తనదైన స్టైల్లో వ్యూహం అనే టైటిల్‌తో సెన్సేషనల్‌ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పెద్దాయన రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వ్యూహం సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు. ఈ పాటకు సంగీతాన్ని అందించి పాడింది కీర్తన శేష్‌. ఈ పాటకు లిరిసిస్ట్‌ రాజశేఖర్‌. వ్యూహం సినిమా దాదాపు 80శాతం షూటింగ్‌ పూర్తయింది. ఇప్పటికే ఆర్జీవి విడుదల చేసిన రెండు టీజర్‌లకు విపరీతమైన స్పందన వచ్చి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఈ చిత్రంలో వై.యస్‌ జగన్‌గా అజ్మల్‌  వై.యస్‌ భారతీ పాత్రలో మానస నటిస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఓ.పి – సుజీష్‌ రాజేంద్రన్, ఎడిటర్‌ – మనీష్‌ ఠాకూర్, పిఆర్వో– శివ మల్లాల.

Vyooham Movie 1st song Release:

YSR death having their own various agendas VYOOHAM 1st song

Tags:   VYOOHAM SONG
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ