Advertisementt

అఫీషియల్: జైలర్ ఓటిటీ డేట్

Sat 02nd Sep 2023 06:43 PM
jailer  అఫీషియల్: జైలర్ ఓటిటీ డేట్
Jailer OTT Streaming Date Revealed అఫీషియల్: జైలర్ ఓటిటీ డేట్
Advertisement
Ads by CJ

ఆగష్టు 10 అంచనాలు లేకుండా వచ్చిన జైలర్ మూవీ నేడు 600 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టేసింది. బీస్ట్ ప్లాప్ తర్వాత దర్శకుడు నెల్సన్ తో రజినీకాంత్ పని చెయ్యడం ఆయన అభిమానులకి సుతరామూ ఇష్టం లేదు. అసలే సూపర్ స్టార్ వరస ప్లాప్స్ తో ఉన్నారు. ఇలాంటి సమయంలో నెల్సన్ దిలీప్ కుమార్ తో రజినీకాంత్ సినిమా చేయడంపై అభిమానులు, నెటిజెన్స్ అయిష్టత చూపించారు. ఆ క్రమంలోనే ప్యాన్ ఇండియా మూవీ గా విడుదలైన జైలర్ మూవీపై ప్రేక్షకుల్లో అంతగా ఆసక్తి కనబడలేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది.

మరి జైలర్ విడుదలయ్యాక సినిమాకి పబ్లిక్ నుండి సూపర్ హిట్ టాక్ స్ప్రెడ్ అవడంతో సునాయాసంగా అంటే మూడు వారాలు తిరిగే లోపులో జైలర్ 600 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టేసింది. దానితో నిర్మాత సన్ పిక్చర్స్ అధినేత తనకి ఇంతగా లాభాలు తెచ్చిపెట్టిన హీరో సూపర్ స్టార్ రజినీకి, దర్శకుడు నెల్సన్ కి లాభాల్లో వాటాతో పాటుగా కాస్ట్లీ కార్లని బహుమతులుగా ఇచ్చారు. థియేటర్స్ లో ఇంత పెద్ద హిట్ అయిన జైలర్ ని ఓటిటీ లో వీక్షించేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.  

ఆగష్టు 10 న థియేటర్స్ లో విడుదలైన జైలర్ మూవీ డిజిటల్ రైట్స్ ని మంచి డీల్ తో అమెజాన్ ప్రైమ్ వారు దక్కించుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని నెల తిరక్కుండానే అంటే సెప్టెంబర్ 7న అమెజాన్ ప్రైమ్ నుండి ఓటిటీ ఆడియన్స్ కి జైలర్ అందుబాటులోకి తెచ్చేస్తున్నారు. దానితో ఫ్యామిలీ ఆడియన్స్ కాస్త ఎగ్జైట్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు జైలర్ ని చూద్దామా అని.. ఇప్పుడు ఆ కోరిక తీరిపోతుంది. 

Jailer OTT Streaming Date Revealed:

Jailer Streaming on Amazon Prime From September 7th

Tags:   JAILER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ