Advertisementt

భగవంత్ కేసరి నుండి మాసీవ్ ఫెస్టివల్ ట్రీట్

Fri 01st Sep 2023 07:31 PM
bhagavanth kesari  భగవంత్ కేసరి నుండి మాసీవ్ ఫెస్టివల్ ట్రీట్
The Highly Energetic Ganesh Anthem From Bhagavanth Kesari Unveiled భగవంత్ కేసరి నుండి మాసీవ్ ఫెస్టివల్ ట్రీట్
Advertisement
Ads by CJ

భగవంత్ కేసరి మేకర్స్ రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ గణేష్ సాంగ్ ప్రోమోతో అలరించారు. ఈరోజు పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేశారు. మాస్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ , శ్రీలీల గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకుంటూ బాబాయ్ అమ్మాయిగా సందడి చేశారు.

గణేష్ పాట కోసం ఎస్ఎస్  థమన్ పెప్పీ, మాస్ ట్యూన్ కంపోజ్ చేసారు. తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట ఆర్కెస్ట్రేషన్ ఆకట్టుకుంది. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం మాస్‌ని కట్టిపడేసింది.  కరేముల్లా, మనీషా పాండ్రంకి ఈ పాటను హై-పిచ్డ్ వోకల్స్ తో ఎనర్జిటిక్ గా అలపించారు.

బాలకృష్ణ, శ్రీలీల తమ క్రేజీ డ్యాన్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. వారి కాస్ట్యూమ్‌ లు,  గెటప్‌ లు , డ్యాన్స్‌లు అన్నీ పాటకు పర్ఫెక్ట్‌గా అనిపించాయి. విజువల్స్ అద్భుతంగా వున్నాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బ్రిలియంట్ గా వుంది. పోస్టర్లు, ప్రోమోలు సెట్ చేసిన అంచనాలను ఈ పాట అందుకుంది.

దర్శకుడు అనిల్ రావిపూడి పాటల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ మ్యూజికల్ జర్నీని చార్ట్‌బస్టర్ నోట్‌లో ప్రారంభించింది. దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది.

The Highly Energetic Ganesh Anthem From Bhagavanth Kesari Unveiled:

The Highly Energetic Ganesh Anthem From Nandamuri Balakrishna Bhagavanth Kesari Unveiled

Tags:   BHAGAVANTH KESARI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ