విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్ మూవీ సైంధవ్ ని మెమరబుల్ గా చేయడానికి భారీ తారాగణం ,అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. హిట్‌వర్స్ ఫేమ్ శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కథ 8 మంది కీలక నటీనటుల చుట్టూ తిరుగుతుంది. ఇప్పటివరకు 7 పాత్రలను పరిచయం చేశారు. ఈరోజు సినిమాలోని మరో కీలక పాత్రను రిలీవ్ చేశారు.
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కోలీవుడ్ స్టార్ ఆర్య ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రను మానస్‌గా పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఫార్మల్ దుస్తుల్లో స్లిక్, స్టైలిష్ లుక్‌తో చేతిలో మెషిన్ గన్‌తో ఫెరోషియస్ గా కనిపిస్తున్నారు ఆర్య.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మేకర్స్ నిమాలోని ఇతర ప్రధాన పాత్రలను పరిచయం చేయడానికి ఒక గ్లింప్స్ విడుదల చేశారు.