బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ లేటెస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ జవాన్. భారీ అంచనాల నడుము ఈ చిత్రం సెప్టెంబర్ 7న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో తనతో పాటు ప్రధాన పాత్రల్లో నటించిన విజయ్ సేతుపతి, నయనతార ఫొటోలను షారూఖ్ రిలీజ్ చేశారు.
జవాన్ రిలీజ్ కావటానికి నెల రోజుల సమయం కూడా లేదు. సినిమా గురించి అభిమానులు, ప్రేక్షకులు, ట్రేడ్ విశ్లేషకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. సిల్వర్ స్క్రీన్‌పై కింగ్ ఖాన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారోనని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జవాన్ ప్రివ్యూ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా రీసెంట్‌గా రిలీజైన దుమ్మే దులిపేలా.. సాంగ్ మ్యూజికల్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో షారూఖ్, నయనతార, విజయ్ సేతుపతి లుక్స్ ఇన్‌టెన్స్‌గా ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో వీరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయో అనే ఆసక్తి మరింత పెరిగింది.