శ్రీరాముల నాగరత్నం సమర్పణలో, రత్న మేఘన క్రియేషన్స్ లో ఆదిత్య శశాంక్, కవితమహతో హీరో హీరోయిన్లుగా, సాకేత్ సాయిరాం, స్నేహ శర్మ, రాథోడ్, రామ్ కుర్ణవల్లి, రామకృష్ణ, కోటయ్య, నటి నటులు గా, సంహారం చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ చిత్రం టీజర్ ను CLP లీడర్ భట్టి విక్రమార్క విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మహిళల పాత్ర వారి స్థితిగతులు గురించి దర్శకుడు ధర్మ ఈ చిత్రంలో చక్కగా చిత్రీకరణ చేశారు. ఈ చిత్రం మంచి విజయం సాధించి ధర్మ కు మంచి పేరు రావాలని ఆకాంక్షించారు.
మ్యూజిక్- సాకేత్ సాయిరాం, కెమెరా- శ్రీరాముల శ్రీనివాస్, ఎడిటర్- కృష్ణ పుత్ర జై, కోరియోగ్రాఫర్- వినమ్ ఇమ్మడి. సహ నిర్మాతలు- తాటికొండ నవీన్, గణేష్ పెనుబోతు, రచన, దర్శకత్వం- శ్రీరాముల ధర్మ, నిర్మాత- ధర్మా చారి.