Advertisementt

కళ్యాణ్ రామ్ డెవిల్ రిలీజ్ డేట్

Sun 06th Aug 2023 10:03 AM
devil  కళ్యాణ్ రామ్  డెవిల్ రిలీజ్ డేట్
DEVIL will be releasing in theatres కళ్యాణ్ రామ్ డెవిల్ రిలీజ్ డేట్
Advertisement
Ads by CJ

వైవిధ్య‌మైన సినిమాల‌ను చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ డెవిల్. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా గ్లింప్స్‌లో హీరో పాత్ర తీరు తెన్నులు, డెవిల్ పాత్రలో తను ఒదిగిపోయిన విధానం, లుక్‌కి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమాపై ఉన్న అంచ‌నాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి. ప్రేక్ష‌కులు, అభిమానులు ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూడ‌టం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో న‌వంబ‌ర్ 24న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. 

డెవిల్ చిత్రంలో ఎవ‌రికీ అంతు చిక్క‌ని ఓ ర‌హ‌స్యాన్ని ఆయ‌న ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఆక‌ట్టుకోబోతున్నారు. గ‌త ఏడాది తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో వ‌న్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన బింబిసారతో మెప్పించిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది డెవిల్ తో మెప్పించటానికి రెడీ అవుతున్నారు. 

రీసెంట్‌గా డెవిల్ హిందీ వెర్ష‌న్‌ గ్లింప్స్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేయ‌గా నెట్టింట తెగ వైర‌ల్ అయ్యింది. సంయుక్తా మీన‌న్ ఇందులో క‌థానాయిక‌.  ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు.

DEVIL will be releasing in theatres :

Spy Thriller DEVIL will be releasing in theatres on November 24th

Tags:   DEVIL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ