వర్సటైల్ యాక్టర్ జగపతిబాబు ప్రధాన పాత్రలో అజయ్ సామ్రాట్ తెరకెక్కించిన సినిమా రుద్రంగి. జులై 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు అక్కడ మంచి గుర్తింపు వచ్చింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఎలాంటి సందడి లేకుండా.. ప్రచారం లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. స్వాతంత్ర అనంతరం తెలంగాణలో జరిగిన సాంఘిక పరిస్థితుల నేపథ్యంలో వాస్తవ సంఘటన ఆధారంగా అజయ్ సామ్రాట్ సినిమాను తెరకెక్కించారు.
ఇందులో భీమ్ రావు దేశ్ ముఖ్ పాత్రలో నటించిన జగపతిబాబు.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలైన ఈ సినిమా ఎలాంటి ప్రచారం లేకుండానే ఇండియాలో నెంబర్ 8లో ట్రెండ్ అవుతుందని.. ఈ సినిమాలో అందరూ చూసి ఆనందించాలని ఆయన కోరారు. తన కెరీర్ లో ఇప్పటివరకు 200 సినిమాల్లో నటించానని.. అందులో పర్ఫార్మెన్స్ పరంగా టాప్ 10 లో రుద్రంగి సినిమా ఉంటుందని తెలిపారు జగపతిబాబు.
ఇందులో అద్భుతమైన కథ ఉంటుందని డైరెక్షన్ పరంగా కూడా రుద్రాంగి మరో స్థాయిలో ఉంటుందని చెప్పారు. తనతోపాటు విమల రామన్ మమత మోహన్ దాస్ క్యారెక్టర్స్ అద్భుతంగా ఉంటాయని.. అందరూ రుద్రంగి సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరారు జేబీ. కేవలం వినోదం మాత్రమే కాదు ఈ సినిమాలో తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి అని ఆయన తెలిపారు.