Advertisementt

SRK జవాన్ నుంచి దుమ్మే దులిపేలా.. సాంగ్

Mon 31st Jul 2023 05:05 PM
jawan  SRK జవాన్ నుంచి  దుమ్మే దులిపేలా.. సాంగ్
Jawan First Song - OUT NOW! SRK జవాన్ నుంచి దుమ్మే దులిపేలా.. సాంగ్
Advertisement
Ads by CJ

ఎంటైర్ ఇండియా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం జవాన్. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ హీరోగా నటిస్తోన్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీపై ఇప్ప‌టికే ఎక్స్‌పెక్ట్సేష‌న్స్ పీక్స్‌లో ఉన్నాయి. సోమ‌వారం రోజున ఈ అంచ‌నాల‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు పెంచుతూ దుమ్మే దులిపేలా.. సాంగ్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. రొమాలు నిక్క‌బొడుచుకునేలా ఆక‌ట్టుకున్న యాక్ష‌న్ స‌న్నివేశాల త‌ర్వాత జవాన్ నుంచి అద్భుత‌మైన  డాన్సింగ్ సాంగ్ రిలీజైంది. 

దుమ్మే దులిపేలా.. అంటూ అనిరుద్ సంగీతం అందించిన ఈ పాట‌ను చూస్తుంటే డాన్స్ చేయాల‌నే ఆలోచ‌న ఆటోమెటిక్‌గా వ‌చ్చేస్తుంది. సాంగ్‌ను తెర‌కెక్కించిన తీరు, అందులోని మూమెంట్స్ చూస్తుంటే ఈ పాట ఓ వేడుక‌లా అనిపిస్తోంది. ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శోభి నేతృత్వంలో రూపొందిన ఈ పాటలో ఎన‌ర్జీ పీక్స్‌లో ఉంది. ఇది ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఆస్కార్ విన్నింగ్ లిరిసిట‌స్ట్ చంద్ర‌బోస్ ఈ పాట‌కు సాహిత్యాన్ని అందించారు. అనిరుద్ పాట‌కు సంగీతాన్ని అందించ‌టంతో పాటు త‌న అద్భుమైన గాత్రంతో ఆల‌పించి ఓ కొత్త ఊపును తీసుకొచ్చారు. ప్ర‌ముఖ 

సార్ చిత్రంలోని పాట‌లు, బీస్ట్‌లోని అర‌బిక్ కుత్తు వంటి ఎన్నో మ్యూజికల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాంగ్స్ అందించిన అనిరుద్ దుమ్మే దులిపేలా సాంగ్‌ను అదే రేంజ్‌లో అందించారు.దీని గురించి ఆయ‌న స్పందిస్తూ జవాన్ సినిమా నుంచి తొలి పాట‌గా వ‌చ్చిన దుమ్మే దులిపేలా.. సాంగ్ మ‌న హృద‌యాల్లో చోటు ద‌క్కించుకుంటుంద‌న‌టంలో సందేహం లేదు. ఇక షారూఖ్ ఖాన్ సినిమాల్లో పాట‌ల‌కు ఎప్పుడూ ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. ఎప్ప‌టిలాగానే ఆయ‌న త‌న స్టార్ డ‌మ్‌తో ఈ పాట‌కు కొత్త ఎన‌ర్జీని తీసుకొచ్చారు కింగ్ ఖాన్. అద్భుతమైన టీమ్‌తో క‌లిసి ప‌ని చేయ‌టం ఆనందంగా ఉంది. మూడు భాషల్లో జ‌వాన్ సినిమాకు సంగీతాన్ని అందించ‌టం  మ‌ర‌చిపోలేని క్రియేటివ్ జ‌ర్నీగా  గుర్తుండిపోతుంది అన్నారు. 

దుమ్మే దులిపేలా..  సాంగ్‌ను ఐదు రోజుల పాటు చిత్రీక‌రించారు. షారూఖ్ త‌న ఎన‌ర్జీ, డాన్స్ మూమెంట్స్‌తో ఓ సెల‌బ్రేష‌న్‌లా పాట‌ను మార్చేశారు. ఇందులో 1000కిపైగా లేడీ డాన్స‌ర్స్ పాల్గొన్నారు. ఓ వైపు బీట్ ప‌రంగా, విజువ‌ల్‌గా ఇండియా అంతటినీ పాట ఆక‌ట్టుకుంటోంది. 

తెలుగులో దుమ్మే దులిపేలా.. అంటూ సాగే ఈ పాట హిందీలో జిందా బందా.. తమిళంలో వంద ఎడమ్.. అంటూ సాగుతుంది. ఈ జవాన్ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ ఈ సినిమాకు స‌హ నిర్మాత‌. సెప్టెంబ‌ర్ 7న జ‌వాన్‌ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.

Jawan First Song - OUT NOW!:

Shah Rukh Khan in Dhumme Dhulipelaa, Jawan First Song - OUT NOW!

Tags:   JAWAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ