Advertisementt

VS11కి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్

Mon 31st Jul 2023 12:39 PM
vishwak sen  VS11కి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్
Vishwak Sen VS11 is Gangs of Godavari VS11కి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్
Advertisement
Ads by CJ

యంగ్ హీరో విశ్వక్ సేన్ VS1 ని కృష్ణ చైతన్య దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో చేతులు కలిపారు. క్రూరమైన ప్రపంచంలో సామాన్యుడి నుంచి సంపన్నుడిగా ఎదిగిన వ్యక్తిగా విశ్వక్ సేన్ ఈ చిత్రంలో కనువిందు చేయనున్నారు. ఆయన గ్రే పాత్ర పోషిస్తున్నారని, ఈ సినిమాలో ఆయన నటన ప్రశంసలు అందుకునేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాలో అంజలి, రత్నమాల అనే ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ చిత్రానికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల నేపథ్యంలో జరిగిన కథతో ఈ చిత్రం రూపొందుతోంది. టైటిల్‌ను ప్రకటించడంతో పాటు, ఈ మూవీ గ్లింప్స్ ని కూడా విడుదల చేసింది చిత్రబృందం. మేము గోదారోళ్ళం.. మాట ఒకటే సాగదీస్తాం.. తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం అంటూ విశ్వక్ సేన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ తో గ్లింప్స్ ప్రారంభమైంది. విశ్వక్ సేన్ లుంగీ కట్టుకొని ఊర మాస్ అవతార్ లో కనిపిస్తున్నారు. రాత్రిపూట లారీల్లో అక్రమంగా సరకు తరలించడం, గోదావరి పరిసరాలు, యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన గ్లింప్స్ మెప్పిస్తోంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. 

ఈ సినిమా 2023, డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. 

Vishwak Sen VS11 is Gangs of Godavari :

Vishwak Sen and Sithara Entertainments VS11 is Gangs of Godavari 

Tags:   VISHWAK SEN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ