Advertisementt

ఆగ‌స్ట్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న రుద్రంకోట‌

Wed 26th Jul 2023 05:37 PM
rudramkota  ఆగ‌స్ట్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న రుద్రంకోట‌
Rudramkota is getting ready for release ఆగ‌స్ట్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న రుద్రంకోట‌
Advertisement
Ads by CJ

సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హిరిస్తూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం రుద్రంకోట‌.  ఏఆర్ కె విజువ‌ల్స్ ప‌తాకంపై  రాము కోన ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  అనిల్‌, విభీష, రియా  హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.  ఇటీవ‌ల  సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం  ఆగ‌స్ట్ నెల‌లో  స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఈ సంద‌ర్భంగా హీరో, నిర్మాత  అనిల్ ఆర్క కండ‌వ‌ల్లి మాట్లాడుతూ...శ్మ‌శాన వాటిక‌లో పెరిగి పెద్దైన ఓ యుకుడి ప్రేమ‌కథా చిత్ర‌మిది. భ‌ద్రాచలం ద‌గ్గ‌ర రుద్రంకోట అనే ఊరి నేప‌థ్యంలో క‌థ న‌డుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చూపించ‌ని అంశాల‌ను మా చిత్రంలో చూపిస్తున్నాము. ఇందులో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే అంశాలుంటాయి.  సీనియ‌ర్ న‌టి జ‌య‌లలిత గారు స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హరిస్తూ ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు.  ప్ర‌ముఖ  సంగీత ద‌ర్శ‌కులు కోటి గారు మా చిత్రానికి అద్భుత‌మైన  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఇటీవ‌ల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ ప్ర‌ముఖులు యుబైఏ స‌ర్టిఫికెట్ తో పాటు సినిమా బావుందంటూ ప్ర‌శంసించారు. మా సినిమా న‌చ్చ‌డంతో  స్క్రీన్ మాక్స్ వారు  గ్రాండ్ గా విడుద‌ల చేయ‌డానికి ముందుకొచ్చారు. ఆగ‌స్ట్ లో సినిమాను విడుద‌ల చేయ‌నున్నాం అన్నారు.

 సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత‌, ఆలేఖ్య‌, బాచి, ర‌మ్య త‌దితరులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి డిఓపీః ఆదిమ‌ల్ల‌ సంజీవ్‌;  సంగీతంః సుభాష్ ఆనంద్‌, నిరంజ‌న్‌; ఎడిట‌ర్ః ఆవుల వెంకటేష్‌;  కొరియెగ్ర‌ఫీః కీర్తి శేషులు శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ , సుచిత్ర చంద్ర‌బోస్;  ఫైట్స్ః జాషువా; డైలాగ్స్ః రంగ‌;  లిరిక్స్ః సాగ‌ర్‌;  డిజైన‌ర్ః వివా రెడ్డి;  పీఆర్ ఓః చంద్ర వ‌ట్టికూటి, మోహ‌న్ తుమ్మ‌ల‌, జీకే మీడియా;  నిర్మాతః అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి;  స్టోరి-స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వంః రాము కోన‌.

Rudramkota is getting ready for release :

Rudramkota is getting ready for release in August

Tags:   RUDRAMKOTA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ