Advertisementt

కెప్టెన్ మిల్లర్ టీజర్ డేట్ ఫిక్స్

Mon 24th Jul 2023 08:08 PM
captain miller  కెప్టెన్ మిల్లర్ టీజర్ డేట్ ఫిక్స్
Captain Miller Teaser on 28th JULY 2023 కెప్టెన్ మిల్లర్ టీజర్ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ భారీ పీరియాడికల్ మూవీ కెప్టెన్ మిల్లర్. 1930-40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సత్యజ్యోతి ఫిలింస్‌ పతాకంపై టి జి త్యాగరాజన్‌ సమర్పణలో సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.  

తాజాగా మేకర్స్ మరో బిగ్ అప్డేట్ తో వచ్చారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నకెప్టెన్ మిల్లర్ టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. కెప్టెన్ మిల్లర్ టీజర్ జూలై 28న విడుదల కానుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ధనుష్ గొడ్డలి పట్టుకొని ఫెరోషియస్ గా నడుస్తున్న లుక్ ఇంట్రస్టింగా వుంది.

ఈ చిత్రంలో కన్నడ స్టార్  శివరాజ్‌ కుమార్‌, సందీప్‌ కిషన్‌, ప్రియాంక అరుళ్‌ మోహన్‌, నివేదితా సతీశ్‌  తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి,శ్రేయాస్ కృష్ణ డీవోపీ గా పని చేస్తున్నారు. నాగూరన్ ఎడిటర్.

కెప్టెన్ మిల్లర్ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

Captain Miller Teaser on 28th JULY 2023:

Dhanush Captain Miller Teaser on 28th JULY 2023

Tags:   CAPTAIN MILLER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ