హీరో నారా రోహిత్ కమ్ బ్యాక్ మూవీ కొన్ని రోజుల క్రితం ఆసక్తిని రేకెత్తించే ప్రీ లుక్ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. ఈరోజు ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ప్రతినిధి 2 అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. దీంతో ఇది ప్రతినిధి సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ కానుంది.
పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిధి సంచలన విజయం సాధించింది. యూనిక్ కథ, గ్రిప్పింగ్ కథనంతో అందరి ప్రశంసలు అందుకుంది. ప్రతినిధి 2 కోసం మరింత బిగ్ స్పాన్ వున్న కథను ఎంచుకున్నారు. One man will stand again, against all odds, అనేది సినిమా క్యాప్షన్.
ఫస్ట్-లుక్ పోస్టర్ మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్, ప్రెజెంటేషన్ తో అందరినీ ఆకట్టుకుంది. నారా రోహిత్ చేయి పైకెత్తి కనిపిస్తున్నారు. అతని జుట్టు నుంచి ముఖం వరకు, ప్రతిదీ వార్తాపత్రికలతో డిజైన్ చేయబడింది. ఫస్ట్ లుక్ సూచించినట్లుగా, ప్రతినిధి 2 సోషల్ ఇష్యూస్ ని డీల్ చేయనుంది. ఫస్ట్ లుక్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది.
కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. యువ సంచలనం మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.
పోస్టర్‌లో చూపిన విధంగా ఈ చిత్రం 2024 జనవరి 25న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.