Advertisementt

సినిమా రివ్యూ: నాతో నేను

Fri 21st Jul 2023 07:37 PM
natho nenu review  సినిమా రివ్యూ: నాతో నేను
Natho Nenu Review సినిమా రివ్యూ: నాతో నేను
Advertisement
Ads by CJ

సినిమా రివ్యూ: నాతో నేను

బ్యానర్‌: శ్రీభవ్నేష్‌ ప్రొడక్షన్స్‌

సాయికుమార్‌, ఆదిత్యా ఓం, శ్రీనివాస్‌ సాయి. ఐశ్వర్య, దీపాలి రాజ్‌పుత్‌, రాజీవ్‌ కనకాల, సమీర్‌, సివిఎల్‌ నరసింహరావు, గౌతంరాజు, భద్రమ్‌, సుమన్‌శెట్టి తదితరులు. 

సాంకేతిక నిపుణులు

కెమెరా: ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి

సంగీతం: సత్య కశ్యప్‌

బ్యాగ్రౌండ్‌ స్కోర్‌: ఎస్‌ చిన్నా

ఎడిటింగ్‌: నందమూరి హరి

నిర్మాత: ప్రశాంత్‌ టంగుటూరి

దర్శకత్వం: శాంతికుమార్‌ తూర్లపాటి

విడుదల తేది: 21-07-2023

జబర్దస్త్ లో కమెడియన్ గా పాపులర్ అయ్యి దర్శకుడిగా మారిన వేణు టిల్లు మొదటి చిత్రం బలగంతోనే టాలీవుడ్ లో బలమైన పునాది వేసుకున్నాడు. ఇప్పుడు అదే జబర్దస్త్ నుండి మరో కమెడియన్ దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అతనే శాంతికుమార్‌ తూర్లపాటి. శాంతికుమార్‌ తూర్లపాటి దర్శకుడిగా మారి సాయికుమార్‌, ఆదిత్యా ఓం కీలక పాత్రల్లో నాతో నేను అనే చిత్రాన్ని తెరకెక్కించారు. శాంతికుమార్‌ జబర్దస్త్ స్టేజ్ పై పంచ్ లతోనే కాదు.. మిమిక్రీ ఆర్టిస్ట్‌ గా, కామెడీతో కూడా టాలెంట్ నిరూపించుకుని ఇప్పుడు దర్శకుడిగా తనని తాను నిరూపించుకోవడానికి రెడీ అయ్యారు. మరి చిన్న తెరపై కామెడీతో అలరించిన ఆయన వెండితెరపై దర్శకుడిగా తన సత్తా చాటాడా లేదా అన్నది తెలుసుకుందాం. 

కథ:

ఓ గ్రామంలో ఉన్నతస్థానంలో ఉన్న కోటీశ్వరరావు (సాయికుమార్‌).. కొన్ని సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఆ సమయంలో ఓ స్వామిజీ కోటీశ్వరరావు కలిసి అతని కష్టాన్ని తెలుసుకుని ఓ వరమిస్తాడు. కోటిగాడు(సాయి శ్రీనివాస్‌) దీప (ఐశ్వర్య)తో పరిచయం, ఆపై ప్రేమలో పడడం జరుగుతుంది. ఇంటిలో పెద్దలు అంగీకరించకపోవడంతో ఐశ్వర్య సాయికి హ్యాండ్‌ ఇస్తుంది. దాంతో అతని జీవితం ఏమైంది. ఓ మిల్లులో పని చేసే కోటిగాడు (ఆదిత్య ఓం) అతను ఇష్టపడిన అమ్మాయి నాగలక్షీ (దీపాలి) మధ్య ఏం జరిగింది. 60 ఏళ్ల సాయికుమార్‌, 40 ఏళ్ల ఆదిత్య ఓం. 20 ఏళ్ల సాయి శ్రీనివాస్‌ల ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ చివరికి ఏ తీరానికి చేరింది. స్వామిజీ సాయికుమార్‌కి ఇచ్చిన ఆ వరం ఏంటి? అన్నది కథ.

ఎలా ఉందంటే..

డైలాగ్ కింగ్ సాయికుమార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికేం లేదు. యాజ్యుజువల్ గా ఆయన అద్భుతంగా నటించారు. ఓ మిల్లులో పని చేస్తూనే తను ఇష్డపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుని మోసపోయిన పాత్రలో ఆదిత్య ఓం నటన బావుంది. ప్రేమ విఫలం పొందిన పాత్రలో సాయి శ్రీనివాస్‌ కూడా బాగా నటించారు. రాజీవ్‌ కనకాల, సివిఎల్‌ నరసింహరావు ఇతర ఆర్టిస్ట్‌లు పాత్రల మేరకు చక్కగా నటించారు. అయితే వాళ్ల పాత్రలను ఇంకాస్త పెంచి ఉంటే ఫుల్‌ఫిల్‌ అయ్యేది. సాయి శ్రీనివాస్‌, ఐశ్వర్య పాత్రలు యూత్‌కి బాగా కనెక్ట్‌ అవుతాయి. 

తొలిసారి దర్శకత్వం వహించిన శాంతి కుమార్‌ తూర్లపాటి మూడు కీలక పాత్రల నడుమ సాగే కథను బాగానే రాశారు కానీ.. ఎగ్జిక్యూట్‌ చేయడంలో కాస్త తడబాటు కనిపించింది. దర్శకుడికి అనుభవం లేకపోవడం, చాలా మంది జబర్దస్త్ యాక్టర్స్ వల్ల కాస్త మైనస్‌గా అనిపించింది. సంగీతం విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటే బావుండేది. ఓవరాల్‌గా అయితే చక్కని సందేశంతోపాటు వినోదాన్ని పంచారు. 

మార్కెట్ లో మని పవర్ గురించి, మనిషి అనే దాని కంటే మనీ అనే రెండక్షరాల మీదే జీవితం నడుస్తోంది అన్న కథాంశంతో రూపొందిన చిత్రమిది. దీనితో 20, 40, 60 ఇలా వయసు దశల వారీగా సాగిన ఈ కథలో సాయికుమార్‌, ఆదిత్యా ఓం, సాయి శ్రీనివాస్‌ పాత్రలను మలచిన తీరు బావుంది. ఆ సన్నివేశాలను దర్శకుడు నడిపించిన తీరు కూడా బావుంది. చేసిన మంచి ఎక్కడికీ పోదనే విషయాన్ని చక్కగా చెప్పారు. డబ్బు మాత్రమే పరమావధిగా భావించి దాని వెనకే జీవితం ఉందనుకుంటే చివరికి ఏమీ మిగలదు అనే చక్కని సందేశం ఇచ్చారు.. సినిమాలో సెట్లు, లొకేషన్లు ఆకట్టుకున్నాయి. నిర్మాతలు కొత్త వారే అయినా ఎక్కడా కాంప్రమైజ్‌ అయినట్లు కనిపించలేదు. నిర్మాణ విలువలు బావున్నాయి. 20 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు పేదవాడి నుంచి కోటీశ్వరుడు అయినా సరే మనకి మన బంధువులు మన ఫ్రెండ్స్ అందరూ ఉండాలా ఉంటేనే సంతోషం అన్నది నాతో నేను సినిమా సారాంశం. సందేశం, వినోదం కలగలిపిన నాతో నేను చిత్రాన్ని ఓసారి చూడొచ్చు.

రేటింగ్: 2.25/5 

Natho Nenu Review:

Natho Nenu Telugu Review

Tags:   NATHO NENU REVIEW
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ