Advertisementt

సైంధవ్ నుంచి క్రేజీ అప్ డేట్

Mon 17th Jul 2023 11:57 AM
saindhav  సైంధవ్ నుంచి క్రేజీ అప్ డేట్
Introducing Sara As Gayathri From Saindhav సైంధవ్ నుంచి క్రేజీ అప్ డేట్
Advertisement
Ads by CJ

విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ చిత్రంలో సైంధవ్‌ గా తన ఫెరోషియస్ షేడ్స్ ఇప్పటివరకు చూశాము. ఇప్పుడు అతని లోతైన భావోద్వేగాన్ని పరిచయం చేశారు. బేబీ సారా హార్ట్ ఆఫ్ సైంధవ్ అని రివిల్ చేశారు మేకర్స్.  పోస్టర్‌ లో పాప వెంకటేష్‌ ను కౌగిలించుకోవడం చూడవచ్చు. పోస్టర్ లో వెంకటేష్‌ గాయాలతో కనిపిస్తున్నారు. సినిమాలో సారా పాత్ర పేరు గాయత్రి.

HIT ఫ్రాంచైజ్ తో వరుసవిజయాలు అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సైంధవ్ హై-ఆక్టేన్ యాక్షన్‌ గా రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. సారా పాత్ర హార్ట్ అఫ్  సైంధవ్.

ఈ చిత్రంతో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖ్ వికాస్ మాలిక్  క్యారెక్టర్ లో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞ పాత్రలో కథానాయికగా నటిస్తుండగా, డాక్టర్ రేణుగా రుహాని శర్మ, జాస్మిన్ పాత్రలో ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలలో నటిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ సైంధవ్ అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

Introducing Sara As Gayathri From Saindhav:

Sara As Gayathri From Venkatesh, Sailesh Kolanu Saindhav

Tags:   SAINDHAV
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ