Advertisementt

డబుల్‌ ఇస్మార్ట్ మోడ్ ఆన్!

Mon 10th Jul 2023 03:43 PM
double ismart  డబుల్‌ ఇస్మార్ట్ మోడ్ ఆన్!
Double iSmart Launched Grandly డబుల్‌ ఇస్మార్ట్ మోడ్ ఆన్!
Advertisement
Ads by CJ

ఉస్తాద్ రామ్, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులని అలరించనుంది. వారి కల్ట్ బ్లాక్‌బస్టర్ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ కోసం వీరిద్దరూ మళ్లీ కలిశారు. ఈసారి డబుల్ మాస్, డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతోంది. పూరి కనెక్ట్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విషు రెడ్డి సీఈవో.

ఈరోజు కోర్ టీమ్, కొంతమంది ప్రత్యేక అతిథుల సమక్షంలో డబుల్ ఇస్మార్ట్ లాంచ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఛార్మి క్లాప్‌ ఇవ్వగా, హీరో రామ్ పోతినేనిపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి స్వయంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ముహూర్తపు సన్నివేశంలో ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్ అని రామ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.

డబుల్ ది ఎంటర్‌టైన్‌మెంట్! డబుల్ ది యాక్షన్! డబల్ ది మ్యాడ్‌నెస్! వి ఆర్ బ్యాక్ !! #డబుల్‌ఇస్మార్ట్ మోడ్ ఆన్!  అంటూ లాంచింగ్ ఈవెంట్ లో ఫోటోలని ట్విట్టర్ లో షేర్ చేశారు రామ్  

డబుల్ ఇస్మార్ట్ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది.

ఇస్మార్ట్ శంకర్ రామ్‌తో పాటు పూరీ జగన్నాథ్‌కి చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమా హీరోకి, దర్శకుడికి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఎక్సయిట్మెంట్, అంచనాలు భారీగా వున్నాయి.

పూరి జగన్నాధ్ చాలా పెద్ద స్పాన్ కలిగి కథ రాశారు. ఇది అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. రామ్‌ని ఇస్మార్ట్ శంకర్ కంటే మాసియర్ క్యారెక్టర్‌లో చూపించబోతున్నారు పూరి జగన్నాధ్.  

Double iSmart Launched Grandly:

 Ram Pothineni, Puri Jagannadh Double iSmart Launched Grandly

Tags:   DOUBLE ISMART
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ