Advertisementt

బ్రో ని USA లో రిలీజ్ చేస్తున్న పీపుల్ సినిమాస్

Tue 04th Jul 2023 05:54 PM
pawan kalyan  బ్రో ని USA లో రిలీజ్ చేస్తున్న పీపుల్ సినిమాస్
BRO to be released in USA by People Cinemas బ్రో ని USA లో రిలీజ్ చేస్తున్న పీపుల్ సినిమాస్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ మరియు  మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ సముతీరకని దర్శకత్వంలో చేస్తున్న సినిమా "బ్రో". ఈ సినిమా తమిళ్లో సూపర్ హిట్ అయిన వినోదాయసీతం సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మరియు సహనిర్మాత వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.

తమిళ్ లో  సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు తెలుగులో మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే &  డైలాగ్స్ ను అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది.

బ్రో  ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఫస్ట్ లుక్ తో వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూపిస్తూ  అభిమానులకు మంచి సప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం. రీసెంట్ గా రిలీజైన టీజర్ కి కూడా అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది ఈ టీజర్. 

బ్రో" సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది అని చిత్ర బృందం ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. ఎన్నో అంచనాలను క్రియేట్ చేసిన ఈ  "బ్రో" చిత్రాన్ని Usa లో "పీపుల్ సినిమాస్" రిలీజ్ చేయనుంది.

BRO to be released in USA by People Cinemas:

Pawan Kalyan and Sai Dharam Tej most-awaited BRO to be released in USA by People Cinemas

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ