బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్.. ఏడాది పఠాన్ చిత్రంతో వరల్డ్ వైడ్‌గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై జవాన్ చిత్రంతో దండయాత్ర చేసి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టడానికి రెడీ అయ్యారు. దీని కోసం ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో జవాన్ ట్రైలర్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకురావటానికి మేకర్స్ భారీ సన్నాహాలు చేస్తున్నారు. మిషన్ ఇంపాజిబుల్ సినిమా థియేటర్స్‌లో జవాన్ ట్రైలర్‌ను ప్రదర్శించబోతున్నారు.
ఎమోషనల్ రోలర్ కోస్టర్‌గా అబ్బుర పరిచే యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులకు వారి సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అసలు ఈ సినిమా కోసం షారూక్ ఖాన్ ఎవరూ ఊహించని సరికొత్త లుక్‌లోకి మారారు. ఆ లుక్‌ను చూసి ఆయన అభిమానులు ఆశ్చర్యపోయారు. దీంతో షారూక్ ఖాన్ పాత్ర ఎలా ఉండబోతుందోనని అందరిలో ఉత్కంఠత నెలకొంది. దీంతో జవాన్ మూవీ ట్రైలర్‌ను చూడాలని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో అభిమానులను మెప్పించిన ఈ స్టార్ హీరో ఇప్పుడు జవాన్ చిత్రంలో ఎలా ఆకట్టుకోబోతున్నాడనేది అందరిలోనూ క్యూరియాసిటీని కలిగిస్తోంది.
షారూక్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.