హీరో అల్లరి నరేష్ వెరైటీ సబ్జెక్ట్ లను ఎంచుకుంటున్నారు. ఈరోజు ఆయన 62వ ప్రాజెక్ట్‌ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. #N62 చిత్రానికి సోలో బ్రతుకే సో బెటరు ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తుండగా, తాజాగా సామజవరగమనతో బ్లాక్ బస్టర్ అందించిన హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించనున్నారు. నరేష్ పుట్టినరోజు సందర్భంగా యూనిక్ స్టైల్ కాన్సెప్ట్ వీడియో ద్వారా చేసిన అనౌన్స్ మెంట్ ఆసక్తికరంగా ఉంది.
దర్శకుడు, అల్లరి నరేష్‌కి ఫోన్ చేసి కథ చెప్పడానికి మాస్ బార్ ను సెలెక్ట్ చేసుకుంటాడు. లవ్, ఎమోషన్, యాక్షన్, డ్రామా అంశాలతో కూడిన కథ నరేష్‌ని మెప్పించిన తర్వాత.. సినిమాకు పని చేసే సాంకేతిక నిపుణులను పరిచయం చేశారు. ఈ కథ చాలా యూనిక్ గా వుంటుంది. ఇందులో నరేష్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు.