Advertisementt

రంగబలి ట్రైలర్ రివ్యూ

Tue 27th Jun 2023 06:35 PM
rangabali  రంగబలి ట్రైలర్ రివ్యూ
Rangabali Theatrical Trailer Review రంగబలి ట్రైలర్ రివ్యూ
Advertisement
Ads by CJ

హీరో నాగ శౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి కలయికలో కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిన రంగబలి చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ తో పాటు మొదటి రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్.  

హీరో తన ఊరు పై తనకు ఉన్న అభిమానానికి గల కారణాన్ని చెప్పడంతో  ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. హీరో తండ్రి మెడికల్ షాప్ నడుపుతుండగా, తను  స్నేహితులతో తిరుగుతూ కాలం గడిపేస్తుంటాడు. ఊర్లో ఓ డాక్టర్ తో ప్రేమలో పడతాడు. స్థానికంగా వున్న నాయకుడికి ఫాలోవర్ గా ఉంటాడు. అయితే వారి మధ్య శత్రుత్వం ఏర్పడి గ్రామంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి.

నాగ శౌర్య మరోసారి అద్భుతమైన నటన కనబరిచి కథను భుజానికెత్తుకున్నారు. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌కి పేరుపొందిన శౌర్య మరోసారి ఆకట్టుకున్నారు. యుక్తి తరేజా తన పాత్రను చక్కగా పోషించింది. విలన్ షైన్ టామ్ చాకో భయపెట్టగా, శరత్ కుమార్ ఇంటెన్సివ్ పాత్రలో కనిపించారు. సత్య తనదైన వినోదాన్నిపంచాడు.

పవన్ బాసంశెట్టి తన రైటింగ్ , టేకింగ్‌ తో ఆకట్టుకున్నాడు. ఫ్యామిలీతో పాటు యూత్ ఆడియన్స్‌ కి కూడా బాగా నచ్చే విధంగా సినిమా తీశాడు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిర్మాణ విలువలు, ఆర్ట్ వర్క్ అన్నీ ఉన్నతంగా వున్నాయి.

Rangabali Theatrical Trailer Review :

Rangabali Theatrical Trailer Unveiled

Tags:   RANGABALI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ