Advertisementt

షూటింగ్ లో హీరో వరుణ్ సందేశ్ కు గాయాలు

Wed 21st Jun 2023 08:21 PM
varun sandesh  షూటింగ్ లో హీరో వరుణ్ సందేశ్ కు గాయాలు
Hero Varun Sandesh injured in shooting spot షూటింగ్ లో హీరో వరుణ్ సందేశ్ కు గాయాలు
Advertisement
Ads by CJ

కొద్దిరోజులుగా సినిమాలకి దూరంగా ఉంటున్న హీరో వరుణ్ సందేశ్.. బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక సినిమాల్లో కాస్త బిజీగా కనిపిస్తున్నాడు. ఈమధ్యన వరస ప్రాజెక్ట్స్ తో షూటింగ్స్ చేస్తున్న వరుణ్ సందేశ్.. బుల్లితెర షోస్ లోను తరచూ భార్య వితికాతో కలిసి దర్శనమిస్తున్నాడు. అయితే తాజాగా వరుణ్ సందేశ్ ఓ సినిమా షూటింగ్ లో గాయపడినట్లుగా తెలుస్తుంది.

వరుణ్ సందేశ్ హీరోగా జాగృతి మూవీ మేకర్ బ్యానర్ పై నిర్మాణం అవుతున్న చిత్రం కానిస్టేబుల్. నిన్న చిత్రానికి సంబంధించిన ఫైటింగ్ సీన్ షూటింగ్ సమయంలో హీరో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయం అయింది.  డాక్టర్లు వరుణ్ ని మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా చెప్పారు. దాంతో కానిస్టేబుల్ సినిమా షూటింగ్ అద్దంతరంగా వాయిదా వేయాల్సి వచ్చిందని చిత్ర దర్శకుడు ఆర్యన్ శుభాన్ అన్నారు. 

పూర్తిగా పల్లెటూరి వాతావరణం లో నిర్మాణం అవుతున్న ఈ చిత్రం ఒక కానిస్టేబుల్ జీవిత కథ చుట్టూ తిరుగుతుందని 40% పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ హీరో వరుణ్ సందేశ్ కోలుకున్న తర్వాత మొదలవుతుందని నిర్మాత బలగం జగదీష్ తెలియజేశారు.

Hero Varun Sandesh injured in shooting spot:

Varun Sandesh injured in shooting

Tags:   VARUN SANDESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ