Advertisementt

భగవంత్ కేసరి టీజర్ థియేటర్లలో స్క్రీనింగ్

Thu 08th Jun 2023 07:18 PM
nandamuri balakrishna,bhagavanth kesari  భగవంత్ కేసరి టీజర్ థియేటర్లలో స్క్రీనింగ్
Bhagavanth Kesari Teaser On June 10th In 108+ Theatres భగవంత్ కేసరి టీజర్ థియేటర్లలో స్క్రీనింగ్
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ ప్రోడ్యూసర్ సాహు గారపాటి, హరీష్ పెద్ది.. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న #NBK108 కు భగవంత్ కేసర అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఈ రోజు అనౌన్స్  చేశారు. క్రేజీ  కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి ఈ టైటిల్ యాప్ట్. ఐ డోంట్ కేర్ అనేది ట్యాగ్‌ లైన్ , టైటిల్ పోస్టర్‌ కు అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

మేకర్స్ మరో బిగ్ అప్‌డేట్‌ తో ముందుకు వచ్చారు. ఈ సినిమా టీజర్‌ ను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న విడుదల చేయనున్నారు. టైటిల్ పోస్టర్ లాగే టీజర్ విషయంలో కూడా అదే స్ట్రాటజీ ని ఫాలో అవుతున్నారు మేకర్స్. టీజర్ ప్రపంచవ్యాప్తంగా 108+ థియేటర్లలో ప్రదర్శించబడుతుంది.

ఇప్పటికే టైటిల్ పోస్టర్‌ తో సంబరాలు మొదలయ్యాయి. స్పెషల్ డేట్‌ లో వచ్చే టీజర్‌ తో అభిమానులు సందడి చేయనున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ ను అనిల్ రావిపూడి ఎలా చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

యూనిక్ స్క్రిప్ట్‌ తో సరికొత్త యాక్షన్‌ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న భగవంత్ కేసరి షూటింగ్ హైదరాబాద్‌ లో జరుగుతోంది. ఇందులో కోర్ టీమ్ పాల్గొంటుంది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. భగవంత్ కేసరి విజయదశమి (దసరా)కి థియేటర్లలో విడుదల కానుంది.  

Bhagavanth Kesari Teaser On June 10th In 108+ Theatres:

Nandamuri Balakrishna Bhagavanth Kesari Teaser On June 10th In 108+ Theatres

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ