Advertisementt

రంగబలి టీజర్ రివ్యూ

Thu 08th Jun 2023 05:12 PM
rangabali teaser  రంగబలి టీజర్ రివ్యూ
Rangabali Teaser Unveiled రంగబలి టీజర్ రివ్యూ
Advertisement
Ads by CJ

నాగశౌర్య రంగబలి చిత్రం ద్వారా పవన్ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రంగబలి చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈరోజు మేకర్స్ అన్ని ప్రధాన పాత్రలు, బ్యాక్‌డ్రాప్‌ ను పరిచయం చేస్తూ సినిమా టీజర్‌ ను విడుదల చేశారు.

దూకుడు స్వభావం, లోకల్ ఫీలింగ్స్ వున్న హీరో చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతుంటాడు. తనని అందరూ విమర్శిస్తుంటే హీరోయిన్ మాత్రం తను చాలా సాఫ్ట్  అని భావిస్తుంది. హీరో తండ్రికి మెడికల్ షాప్ ఉంది. కానీ హీరోకి మెడిసిన్ కి సంబధించిన బేసిక్స్ కూడా తెలియవు. హీరోయిన్ వృత్తిరీత్యా డాక్టర్.

నాగశౌర్య ఈ పాత్రను చాలా యీజ్ తో డైనమిక్ గా పోషించారు. గోదావరి యాసలో డైలాగులు చెప్పి అలరించారు. యుక్తి తరేజా కూల్‌ గా కనిపించింది. సత్య, సప్తగిరి, ఇతర హాస్యనటుల తగిన వినోదాన్ని పంచారు. ఇందులో షైన్ టామ్ చాకో పాత్రను కూడా పరిచయం చేశారు.

కామెడీ, రొమాన్స్‌తో పాటు యాక్షన్‌ కూడా ఉంటుంది. పవన్ బాసంశెట్టి అన్ని కమర్షియల్ హంగులతో కూడిన చిత్రంతో ముందుకు వచ్చారు. ఈ చిత్రం అన్ని వర్గాల  ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకునేలా చూసుకున్నారు.

Rangabali Teaser Unveiled:

Rangabali Teaser Review

Tags:   RANGABALI TEASER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ