Advertisementt

NBK108 టైటిల్, ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్

Mon 05th Jun 2023 07:46 PM
nbk108  NBK108 టైటిల్, ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్
NBK108 Title And First Look On June 8th NBK108 టైటిల్, ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కలిసి #NBK108 తో మాస్, అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ కు సరికొత్త అనుభూతిని అందించదానికి సిద్ధమవుతున్నారు. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు. బాలకృష్ణ అభిమానులకు ఇది చాలా ప్రత్యేకమైన పుట్టినరోజు కానుంది. ఎందుకంటే ఈ బర్త్ డే కి బాలయ్య నుండి చాలా ట్రీట్‌లు ఉన్నాయి. బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10)కి రెండు రోజుల ముందు అంటే జూన్ 8వ తేదీన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు. NBK108 కి పవర్ ఫుల్ టైటిల్ లాక్ చేశారు. పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్ చూసేందుకు అభిమానులు మరో మూడు రోజులు ఆగాలి. అంతేకాకుండా జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పెద్ద సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు.

కాజల్ అగర్వాల్ హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఉగాది సందర్భంగా ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్‌లను ప్రజంట్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ల కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

#NBK108 విజయదశమి (దసరా)కి థియేట్రికల్ విడుదలకు సిద్ధమౌతోంది.

NBK108 Title And First Look On June 8th:

NBK108 Title And First Look On June 8th, Big Update For NBK Birthday

Tags:   NBK108
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ