Advertisementt

సరిగ్గా రెండు వారాల్లో ఆదిపురుషుని ఆగమనం

Fri 02nd Jun 2023 05:52 PM
adipurush  సరిగ్గా రెండు వారాల్లో ఆదిపురుషుని ఆగమనం
Countdown begins: Two weeks for the arrival of mighty Adipurush సరిగ్గా రెండు వారాల్లో ఆదిపురుషుని ఆగమనం
Advertisement
Ads by CJ

ప్రభాస్ మరియు కృతి సనన్ లీడ్ రోల్స్ పోషిస్తున్న ఆదిపురుష్ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా విడుదల తేదీకి రోజులు లెక్కపెడుతున్నారు. జూన్ 16న విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఇవాల్టి నుంచి కేవలం రెండు వారాలు మాత్రమే ఉంది. సరిగ్గా రెండు వారాల్లోనే ఆదిపురుషుని ఆగమనం నేపథ్యంలో సినిమా దర్శక నిర్మాతలు ఒక కొత్త పోస్టర్ ను ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఎంతో కోపంగా, చేతిలో గధ పట్టుకొని కనిపిస్తున్న హనుమంతుడి పోస్టర్ ఈరోజు విడుదల చేశారు. చూడగానే ఒళ్ళు గగుర్పొడిచే ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది.

ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూన్ 6వ తేదీన తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్నారు. 

ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ మరియు కృతి సనన్ తో పాటు సైఫ్ అలీ ఖాన్ మరియు సన్నీ సింగర్ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. పాన్ ఇండియా సినిమా గా వస్తున్న ఈ సినిమా విడుదల కోసం భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. 

Countdown begins: Two weeks for the arrival of mighty Adipurush:

Adipurush Makers unveiled Hanuman poster.

Tags:   ADIPURUSH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ