Advertisementt

శ్రీకాంత్ అడ్డాల పెద కాపు-1 ఫస్ట్ లుక్

Fri 02nd Jun 2023 01:28 PM
srikanth addala,peda kapu-1  శ్రీకాంత్ అడ్డాల పెద కాపు-1 ఫస్ట్ లుక్
Peda Kapu-1, First Look Unveiled శ్రీకాంత్ అడ్డాల పెద కాపు-1 ఫస్ట్ లుక్
Advertisement
Ads by CJ

సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, ద్వారకా క్రియేషన్స్‌ పై బ్లాక్‌బస్టర్ అఖండ చిత్రాన్ని అందించిన నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డితో కలిసి విరాట్ కర్ణను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని కూడా నిర్మాతలు అనౌన్స్ చేశారు.

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా కోసం పవర్ ఫుల్, మాస్-అప్పీలింగ్ టైటిల్ పెద కాపు-1ని లాక్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విరాట్ కర్ణని ఇంటెన్స్, రగ్గడ్ గా ప్రెజెంట్ చేశారు. భారీ జనసమూహంలో విజయానికి గుర్తుగా అభివాదం చేస్తూ కనిపించారు కర్ణ. మంచి లుక్స్ ఉన్న విరాట్ కర్ణ పర్ఫెక్ట్ మెటీరియల్. ఓ సామాన్యుడి సంతకం అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఫస్ట్ లుక్ అందరినీ ఆకర్షించింది.

మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ఛోటా కె నాయుడు కెమెరామెన్ కాగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్ ఫైట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రాఫర్. పెద కాపు-1 షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

Peda Kapu-1, First Look Unveiled:

Srikanth Addala Peda Kapu-1 First Look Unveiled

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ