Advertisementt

బీడీని త్రీడీలో చూపించిన గుంటూరు కారం

Wed 31st May 2023 06:57 PM
guntur kaaram,mahesh  బీడీని త్రీడీలో చూపించిన గుంటూరు కారం
Mahesh Guntur Kaaram Glimps Out బీడీని త్రీడీలో చూపించిన గుంటూరు కారం
Advertisement
Ads by CJ

మహేష్ మాస్ స్ట్రైక్ వచ్చేసింది.. మహేష్ ఫ్యాన్సుకి గరం గరం ట్రీట్ తెచ్చేసింది. ఇప్పటివరకూ వినవచ్చిన పలు టైటిల్సుని పక్కనెట్టి ఈ మధ్య కాలంలో గట్టిగా వినిపించిన గుంటూరు కారం టైటిల్ ని SSMB 28 కి కన్ ఫర్మ్ చేస్తూ ఆ పేరుకి తగ్గ ఘాటైన గ్లిమ్ప్స్ వదిలారు త్రివిక్రమ్. 

ఆ గ్లిమ్ప్స్ లో చిటికేసి స్క్రీన్ పైకి ఎంట్రీ ఇస్తూ.. గిర్రు గిర్రున కర్ర తిప్పుతూ.. గుప్పు గుప్పున బీడీ తాగుతూ.. ఊర మాస్ యాటిట్యూడ్ తో మహా మ్యాన్లీగా కనిపించిన మహేష్ ఏందట్టా చూస్తున్నావ్... బీడీ - త్రీడీ లో కనపడతందా... అనే గుంటూరు నాటు డైలాగ్ తో ఆ క్యారెక్టరైజషన్ పై క్లారిటీ ఇచ్చేసారు. ఈ చిత్రంపై అభిమానుల అంచనాలను అమాంతం పదింతలు పెంచేశారు. ఇక సన్న కర్ర సవ్వా దెబ్బ అంటూ గుంటూరు పడికట్టు పదాల ప్రత్యేక పాటతో థమన్ చేత త్రివిక్రమ్ చేయించిన BGM ఆ విజువల్స్ లోని ఇంపాక్ట్ ని, ఇంటెన్స్ ని డబుల్ చేసేసింది. 

ఓవరాల్ గా ఫాన్స్ ఎక్స్ పెక్టేషన్సుకి ఏ మాత్రం తగ్గకుండా ఉన్న గుంటూరు కారం గ్లిమ్ప్స్ యు ట్యూబ్ వ్యూస్ లోనూ సరికొత్త రికార్డులు సాధిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇన్నాళ్లూ ఈ గుంటూరు కారాన్ని గుట్టుగా దాచిన గురూజీ మొత్తంగా సినిమాలో ఇంకెన్ని ప్రత్యేకతలు పరిచారో, మరిన్ని విశేషాలను నింపారో అనే ఉత్సుకత, ఉత్సాహంతో ఊగిపోతున్నారు సూపర్ స్టార్ ఫాన్స్. 

నిజమే. నోట్లోంచి బీడీ బయటికి తీసే ఒకే ఒక్క షాట్ తో సరికొత్త మాసీ మహేష్ ని మనకు పరిచయం చేసిన గురూజీ.. గుంటూరు కారాన్ని మించే - మరిపించే, ధీటైన - ఘాటైన పాత్రనే మహేష్ కోసం మలిచారనిపిస్తుంది ఈ గ్లిమ్ప్స్ చూసిన ఎవ్వరికైనా..!!

Mahesh Guntur Kaaram Glimps Out:

Mahesh Guntur Kaaram Glimps Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ