మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి రెండు బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మే 24న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కానుంది.
ఐదు భాషలకు చెందిన ఐదుగురు సూపర్ స్టార్లు ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. తెలుగు వెర్షన్‌కి సంబంధించిన పోస్టర్‌ను వెంకటేష్ విడుదల చేయనుండగా, జాన్ అబ్రహం, శివ రాజ్‌కుమార్, కార్తీ, దుల్కర్ సల్మాన్‌లు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నారు.
రవితేజ మునుపెన్నడూ చూడని విధంగా మాస్, రగ్డ్ లుక్‌లో కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ ఫెరోషియస్, స్ట్రైకింగా ఉండబోతుంది.
టైగర్ నాగేశ్వరరావు1970ల నేపథ్యంలో స్టూవర్టుపురంలోని గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. ఈ పవర్ ఫుల్ పాత్ర పోషించేందుకు రవితేజ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్త బాడీ లాంగ్వేజ్, యాసతో ఆకట్టుకుంటారు. ఈ సినిమాలో రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.