Advertisementt

మనోజ్ మంచు వాట్ ది ఫిష్ ఫస్ట్ లుక్ గ్లింప్స్

Sat 20th May 2023 08:16 PM
manoj manchu  మనోజ్ మంచు వాట్ ది ఫిష్ ఫస్ట్ లుక్ గ్లింప్స్
WHAT THE FISH First Look Glimpse Unleashed మనోజ్ మంచు వాట్ ది ఫిష్ ఫస్ట్ లుక్ గ్లింప్స్
Advertisement
Ads by CJ

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కమ్ బ్యాక్ మూవీని ఇదివరకే ప్రత్యేకంగా అనౌన్స్ చేశారు. వాట్ ది ఫిష్ అనే ప్రాజెక్ట్‌కి  నూతన దర్శకుడు వరుణ్ కోరుకొండ దర్శకత్వంతో పాటు కథ , స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. మనం మనం బరంపురం అనేది సినిమా ట్యాగ్ లైన్.

వాట్ ది ఫిష్ హై ప్రొడక్షన్ వాల్యూస్, అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది. పాన్-ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని 6ix సినిమాస్‌  విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ  నిర్మిస్తున్నారు.

రాకింగ్ స్టార్ మనోజ్ మంచుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, టీమ్ ఫస్ట్ లుక్‌ గ్లింప్స్ తో ముందుకు వచ్చింది. ఇందులో మనోజ్ ని విభిన్న గెటప్‌లలో చూడవచ్చు. ఐయామ్ ఏ  బ్యాడ్ చైల్డ్.. ఐయామ్ కమింగ్ ఫర్ యూ.. ఫైండ్ ఎ ప్లేస్ టు హైడ్.. ఐయామ్ ఎ బ్యాడ్ చైల్డ్.. ది వార్ హ్యాజ్ బిగెన్.. ఫైండ్ ఎ ప్లేస్ టు రన్ అని మనోజ్ చెప్పడం క్యూరియాసిటీని పెంచుతోంది.  

అటామిక్ క్రేజ్, రా, గ్రిట్, స్వాగే, గన్స్ బ్లేజింగ్ అనే పదాలు సినిమా థీమ్‌ను తెలిజేస్తున్నాయి. వాట్ ది ఫిష్ ఒక యూనిక్  కాన్సెప్ట్‌తో కూడిన ప్రత్యేకమైన సినిమా అని గ్లింప్స్  ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. శక్తికాంత్ కార్తీక్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఫస్ట్ లుక్ గ్లింప్స్‌లో అందించిన కంటెంట్ లాగా చాలా క్రేజీగా ఉంది.

ఈ సినిమా అడ్వెంచర్ షూటింగ్ బ్యూటీఫుల్ టొరంటో నగరం, కెనడాలోని వివిధ ప్రదేశాలలో 75 రోజుల పాటు జరగనుంది, ఈ చిత్రం లో పని చేస్తున్న ప్రతిభావంతులైన తెలుగు నటీనటులు, ప్రపంచ ప్రఖ్యాత నటీనటులు, టెక్నికల్ టీం వివరాలని త్వరలో తెలియజేస్తారు మేకర్స్.

WHAT THE FISH First Look Glimpse Unleashed:

Manoj Manchu WHAT THE FISH First Look Glimpse Unleashed

Tags:   MANOJ MANCHU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ