Advertisementt

సైంధవ్: వికాస్ మాలిక్ గా నవాజుద్దీన్

Fri 19th May 2023 07:02 PM
nawazuddin siddique,saindhav  సైంధవ్: వికాస్ మాలిక్ గా నవాజుద్దీన్
Saindhav: Nawazuddin Siddique as Vikas Mehta సైంధవ్: వికాస్ మాలిక్ గా నవాజుద్దీన్
Advertisement
Ads by CJ

విక్టరీ వెంకటేష్ 75వ లాండ్ మార్క్ మూవీ సైంధవ్ కు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హై-ఆక్టేన్ యాక్షన్‌ ఎంటర్ ట్రైనర్ రూపొందుతున్న ఈ చిత్రంలో  ప్రముఖ తారాగణం కనిపిస్తోంది. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది.

బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ఈ రోజు నవాజుద్దీన్ సిద్ధిఖీ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ చిత్రంలో ఆయన ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు మేకర్స్. వికాస్ మాలిక్ గా నవాజుద్దీన్ సిద్ధిఖీ ని పరిచయం చేశారు. ఒక కాస్ట్లీ కార్ పై కూర్చుని బీడీ తాగుతూ కనిపించారు. గెటప్ లో క్లాస్‌ గా కనిపిస్తూనే సినిమాలో డెడ్లీ విలన్‌ గా నటిస్తున్నారు.

మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా, డాక్టర్ రేణు పాత్రలో రుహాని శర్మ, జాస్మిన్ పాత్రలో ఆండ్రియా జెర్మియా కనిపించనున్నారు.

Saindhav: Nawazuddin Siddique as Vikas Mehta:

Nawazuddin Siddique playing this role in Saindhav

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ