Advertisementt

ఒకే వేదికపై ప్యాన్ ఇండియా స్టార్స్

Wed 17th May 2023 10:27 PM
ntr centenary  ఒకే వేదికపై ప్యాన్ ఇండియా స్టార్స్
Pan India stars attends NTR Centenary Celebrations ఒకే వేదికపై ప్యాన్ ఇండియా స్టార్స్
Advertisement
Ads by CJ

ప్యాన్ ఇండియా స్టార్స్ విడివిగా కనిపిస్తేనే అభిమానులు ఆనందానికి హద్దులు ఉండవు. ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్స్ అందరూ ఒకే స్టేజ్ పై కనిపిస్తే అభిమానుల కళ్ళకి ఆనందం, సాధారణ ప్రేక్షకులకి కనుల విందు. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అందరూ ఒకే స్టేజ్ పై మరి ఆనందం కాక ఇంకేం ఉంటుంది. ఆ స్టేజ్ ఏమిటి అనుకుని ఆలోచిస్తున్నారా.. ఎన్టీఆర్ సెంచరీ సెలెబ్రేషన్స్ అంటూ TD. జనార్దన్-నందమూరి ఫ్యామిలీ కలిసి చేస్తున్న మెగా ఈవెంట్ మే 20 హైదరాబాద్ లో జరగబోతున్న విషయం తెలిసిందే.

ఈ ఈవెంట్ కి నందమూరి రామకృష్ణ ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి ఆహ్వానించడం హాట్ టాపిక్ కాగా.. ఇప్పుడు ఇదే ఈవెంట్ లో బాలయ్య-ఎన్టీఆర్ ఒకే స్టేజ్ పై కనిపిస్తే నందమూరి అభిమానులకి పండగే. అంతేకాకుండా.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్స్ పాల్గొనబోతున్నారనే న్యూస్ కూడా వినిపిస్తుంది. హైదరాబాద్ లో గ్రాండ్ గా ఎన్టీఆర్ సెంచరీ సెలెబ్రేషన్స్ కి నందమూరి ఫ్యామిలీ ప్లాన్ చేసింది.

ఇంతకుముందు విజయవాడలో సూపర్ స్టార్ రజినీకాంత్ అతిధిగా జరిగిన ఈవెంట్ సక్సెస్ అవ్వగా.. అంతకు మించి భారీ లెవల్లో ఇక్కడ హైదరాబాద్ ఈవెంట్ కి ప్లానింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఈవెంట్ కి లెక్కకు మించి అభిమానులు హాజరయ్యే అవకాశం ఉన్న కారణంగా ఎన్టీఆర్ సెంచరీ సెలెబ్రేషన్స్ ని  ఇప్పుడు అనుకున్న వేదిక కాకుండా వేరేచోట రామోజీ ఫిలిం సిటీలో కానీ, లేదంటే LB స్టేడియం లో కానీ నిర్వహించాలని చూస్తున్నారు. 

ఈ ఈవెంట్ మే 20 సాయంత్రం నందమూరి ఫ్యామిలీ, ప్యాన్ ఇండియా స్టార్స్, కన్నడ శివరాజ్ కుమార్, నారా చంద్రబాబు నాయుడు మధ్యన అంగరంగ వైభవంగా జరగబోతున్నట్టుగా సమాచారం అందుతుంది.

Pan India stars attends NTR Centenary Celebrations:

Pan India stars attends NTR Centenary Celebrations at Hyderabad

Tags:   NTR CENTENARY