Advertisementt

NBK108 లోకి ఎంటర్ అయిన హిందీ యాక్టర్

Wed 10th May 2023 11:19 AM
arjun rampal,nbk108  NBK108 లోకి ఎంటర్ అయిన హిందీ యాక్టర్
Arjun Rampal On Board For NBK108 NBK108 లోకి ఎంటర్ అయిన హిందీ యాక్టర్
Advertisement
Ads by CJ

నటసింహ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి ల మోస్ట్ అవైటెడ్ మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ #NBK108లో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్ర ల్లో నటించనున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పుడు ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తెరపైకి  వచ్చారు. 

అనౌన్స్‌మెంట్ వీడియోలో అర్జున్ రాంపాల్, బాలకృష్ణ లెజెండ్ చిత్రంలోని ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు అనే పాపులర్ డైలాగ్ చెప్పారు. ఇందులో అర్జున్ రాంపాల్, అనిల్ రావిపూడి మధ్య సంభాషణ కూడా వుంది. అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. బాలకృష్ణ, అర్జున్ రాంపాల్ లని కలిసి తెరపై చూడటం ఆసక్తికరంగా ఉండబోతుంది.

ఉగాది సందర్భంగా బాలకృష్ణ ను రెండు డిఫరెంట్ లుక్ లో ప్రజంట్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని దసరా స్పెషల్ గా విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు.

Arjun Rampal On Board For NBK108:

Arjun Rampal On Board For Nandamuri Balakrishna, Anil Ravipudi, Shine Screens NBK108

Tags:   ARJUN RAMPAL, NBK108
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ