Advertisementt

బ్యూటీఫుల్ మెలోడిగా ఖుషీ సాంగ్

Tue 09th May 2023 03:15 PM
kushi  బ్యూటీఫుల్ మెలోడిగా ఖుషీ సాంగ్
Kushi First Song Na Roja Nuvve Is a Beautiful Melody బ్యూటీఫుల్ మెలోడిగా ఖుషీ సాంగ్
Advertisement
Ads by CJ

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ గా ఖుషీ మూవీ నుంచి ఓ బ్యూటీఫుల్ మెలోడియస్ సాంగ్ ను విడుదల చేసింది మూవీ టీమ్. శివ నిర్వాణ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. వాటిని రెట్టింపు చేసేలా విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ సాంగ్ కనిపిస్తోంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచి ఈ పాటను తనే పాడాడు.

ఈ గీతాన్ని దర్శకుడు శివ నిర్వాణ రాయడం ఓ విశేషమైతే.. నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే అంటూ పాట మొత్తంలో   లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాల పేర్లు కలిసి వచ్చేలా సాహిత్యం ఉండటం మరో విశేషం. నా కడలి కెరటంలో ఓ మౌనరాగం నువ్వేలే.. నీ అమృపు జడిలో ఓ ఘర్షణే మొదలైంది.., నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అనుపల్లవిగా.. నీ గుండె సడి లయలో.. నే మారనా నీ ప్రతిధ్వనిగా.. అంటూ మంచి సాహిత్యం కూడా ఈ పాటలో కనిపిస్తోంది. 

ఏ సినిమా నుంచి అయినా మొదటి పాట వస్తోందంటే అది ఆ మూవీ ఫ్లేవర్ ను తెలియజేస్తుంది. ఖుషీ నుంచి వచ్చిన ఈ గీతం కూడా ఓ ప్లెజెంట్ లవ్ స్టోరీని చూడబోతున్నాం అనేలా కనిపిస్తోంది. శివ నిర్వాణే నృత్యరీతులు సమకూర్చిన ఈ గీతాన్ని కశ్మీర్ లోని అందమైన లొకేషన్స్‌ లో చిత్రీకరించారు. 

సమంత ఓ కశ్మీరి యువతిగా కనిపిస్తోంది. తన ప్రేమను గెలుచుకునే యువకుడుగా విజయ్ నటించాడు. వీరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని పాట చూస్తే అర్థమౌతోంది. ఫస్ట్ సాంగ్ తోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసిన ఖుషీ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషలతో పాటు హిందీలోనూ సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నారు. 

Kushi First Song Na Roja Nuvve Is a Beautiful Melody :

Kushi First Song Na Roja Nuvve out

Tags:   KUSHI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ