Advertisementt

పర్శనల్ గా నేను రౌడీనే: కృతి శెట్టి

Sat 06th May 2023 06:35 PM
krithi shetty,custody  పర్శనల్ గా నేను రౌడీనే: కృతి శెట్టి
Krithi Shetty Interview పర్శనల్ గా నేను రౌడీనే: కృతి శెట్టి
Advertisement
Ads by CJ

యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ కస్టడీ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌ లో ఒకటి. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ని పవన్‌కుమార్‌ సమర్పిస్తుండగా శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్ ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే 12న సినిమా విడుదల కాబోతున్న నేపధ్యంలో  హీరోయిన్ కృతి శెట్టి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

కస్టడీ కథలో ఆసక్తికరమైన అంశం ఏమిటి ?

దాదాపు సినిమాల్లో హీరో, విలన్ ని అంతం  చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ కస్టడీ లో మాత్రం హీరో విలన్ ని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. ఇది చాలా ఆసక్తికరంగా వుంటుంది.

కస్టడీ లో మీ పాత్రలో  నచ్చింది ఏమిటి ?

కస్టడీ కథలో నా పాత్ర కు చాలా ప్రాధన్యత వుంది. కథ సీరియస్ అవుతున్నప్పుడు నా పాత్ర  దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది.  స్క్రీన్ ప్లే తో నా పాత్ర ప్రయాణిస్తూ వుంటుంది. నటనకు ఆస్కారం వుండే పాత్ర. నా పాత్ర నిడివి కూడా ఎక్కువే.  సాధారణంగా సినిమాలకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాం, కస్టడీ కోసం జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేశాను. ఇది యాక్షన్ ఎంటర్ టైనర్. ఈ సినిమా తర్వాత మార్వల్స్ స్టూడియో నుంచి నాకు కాల్ వస్తుందని వెంకట్ ప్రభుగారితో చెప్పాను(నవ్వుతూ). నా పాత్రలో మంచి ఎమోషన్ వుంటుంది.

అండర్ వాటర్ సీక్వెన్స్ ఆసక్తికరంగా వుంటుందని విన్నాం ?

అవును, చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. దాదాపు 15 రోజులు ఆ సీక్వెన్స్ చేశాం. ఒక ఐదు రోజుల పాటు కంటిన్యూ గా వాటర్ లోనే వున్నాం. దాని కోసం రెండు రోజులు శిక్షణ తీసుకున్నాం. ఊపిరి తీసుకోకుండా రెండు నిముషాలు పాటు వుంటేనే ఒక షాట్ సాధ్యపడుతుంది. ఒక దశలో నాకు భయం వేసింది.

నాగ చైతన్య తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

నాగ చైతన్య గారు నా ఫేవరట్ నటుడే కాదు వ్యక్తి కూడా. తను చాలా నిజాయితీగా వుంటారు. ఈ కథలో పాత్రలు చాలా కంఫర్ట్ బుల్ గా వుండాలి. నేను ఆ ఫ్ స్క్రీన్ చై తో కంఫర్ట్ బుల్ గా వుంటాను కాబట్టి ఆన్ స్క్రీన్ కూడా చక్కగా వర్క్ అవుట్ అయ్యింది.

కస్టడీ

  షూటింగ్ అనుభవాలు గురించి చెప్పండి ?

కస్టడీ సెట్స్ లో నేను రౌడీలా వున్నానని వెంకట్ ప్రభు గారు అన్నారు(నవ్వుతూ). పర్శనల్ గా నేను కొంచెం రౌడీనే. (నవ్వుతూ) ఏదైనా అవతలి వాళ్ళు నాకు ఇచ్చే కంఫర్ట్ ని బట్టి  వుంటుంది. చైతు గారితో మళ్ళీ వర్క్ చేస్తున్నాను కాబట్టి ఆ కంఫర్ట్ వుంటుంది. అలాగే అరవింద్ స్వామీ గారు, శరత్ కుమార్ గారు, సంపత్ గారు, వెన్నెల కిషోర్ గారు ఇలా చాలా చక్కని టీంతో పని చేయడం మంచి అనుభూతి.

వెంకట్ ప్రభుగారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

వెంకట్ ప్రభు గారు చాలా ఫ్రెండ్లీ. చాలా కేరింగ్ గా చూసుకుంటారు. చాలా స్వీట్ పర్శన్.

కొన్ని చిత్రాలు నిరాశ పరిచాయి కదా .. అపజయాలని ఎలా చూస్తారు ?

ఎవరికీ సక్సెస్ రెసెపీ తెలీదు. (నవ్వుతూ) మన ప్రయత్నం మనం చేస్తాం. జయాపజయాలు ప్రయాణంలో భాగమే. అయితే అపజయం వచ్చినపుడు దాని విశ్లేషించుకొని మళ్ళీ అలాంటివి  పునరావృతం కాకుండా చూసుకుంటాను.

లేడి ఓరియంటెడ్ చిత్రాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారా?

ప్రస్తుతానికి లేదండీ. భవిష్యత్ లో మంచి కథ వస్తే దాని గురించి ఆలోచిస్తాను.

బాలీవుడ్ వైపు ఆలోచనలు ఉన్నాయా ?

ప్రతి భాషలో మంచి డెబ్యు సినిమా వుండాలి. డెబ్యు సినిమా చాలా ముఖ్యం. అలాంటి మంచి కథ కోసం ఎదురు చూస్తున్నా.

దర్శకత్వం చేసే ఆలోచనలు ఉన్నాయా ?

నాకు దర్శకత్వం చేయాలనే వుంది. అయితే అది ఇప్పుడే కాదు. నేను ప్రతి విషయాన్ని పరిశీలిస్తాను. ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి.

కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ ?

శర్వానంద్ గారితో ఓ సినిమా చేస్తున్నా. ఓ మలయాళం సినిమా చేస్తున్నాను. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ మేకర్స్ అనౌన్స్ చేస్తారు.

Krithi Shetty Interview :

Krithi Shetty Interview about Custody

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ