Advertisementt

ప్రభాస్, చరణ్ లు మెచ్చిన మిస్ శెట్టి టీజర్

Thu 04th May 2023 04:44 PM
prabhas,ram charan  ప్రభాస్, చరణ్ లు మెచ్చిన మిస్ శెట్టి టీజర్
Ram Charan and Prabhas loves Miss Shetty Mr Polishetty teaser ప్రభాస్, చరణ్ లు మెచ్చిన మిస్ శెట్టి టీజర్
Advertisement
Ads by CJ

ఏ సినిమాకైనా పెద్ద స్టార్స్ నుంచి ప్రశంసలు వస్తే ఆ బూస్టప్ వేరే ఉంటుంది. అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి నటించిన  మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ టీజర్ కు ఇండియాస్ టాప్ స్టార్స్ అయిన ప్రభాస్, రామ్ చరణ్ నుంచి అద్భుతమై స్పందన వచ్చింది. ఈ టీజర్ తమకు ఎంతో నచ్చిందని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం విశేషం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, నవీన్ పోలిశెట్టి మరియు అనుష్క నటించిన టీజర్ కొన్ని రోజుల క్రితం ఆవిష్కరించబడింది మరియు దీనికి గొప్ప స్పందన వచ్చింది.

విడుదలైన కొన్ని గంటల్లోనే టీజర్ వైరల్ అయింది. అద్భుతంగా ఉందనే ప్రశంసలతో పాటు ఎంటర్టైనింగ్ గా ఉందనే ఎంకరేజ్మెంట్స్ కూడా వచ్చాయి. అనుష్క చాలా రోజుల తర్వాత స్క్రీన్ పై కనిపించబోతోన్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఈ క్రమంలో ప్రభాస్ నుంచి శుభాకాంక్షలు రావడం సినిమాకు పెద్ద ఎసెట్ అయింది. ఈ టీజర్ ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ.. చాలా ఎంటర్ టైనింగ్ గా ఉందని, టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు చెప్పాడు ప్రభాస్. 

లేటెస్ట్ గా రామ్ చరణ్‌ కూడా టీజర్‌ను మెచ్చుకుంటూ #MissShettyMrPolishetty టీజర్‌ నాకు బాగా నచ్చింది. రిఫ్రెష్‌గా కనిపిస్తోంది 😃 మొత్తం టీమ్‌కి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు.

ఇలా ఇద్దరు పెద్ద స్టార్స్ టీజర్ ను హైప్ చేయడంతో మూవీ టీమ్ కు పెద్ద బూస్టప్ గా నిలిచిందని చెప్పొచ్చు. 

Ram Charan and Prabhas loves Miss Shetty Mr Polishetty teaser:

Prabhas and Ram Charan loved Miss Shetty Mr Polishetty teaser 

Tags:   PRABHAS, RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ