Advertisementt

ఉగ్రం ట్రైలర్ రివ్యూ

Fri 21st Apr 2023 07:49 PM
ugram trailer  ఉగ్రం ట్రైలర్ రివ్యూ
Ugram Trailer Review ఉగ్రం ట్రైలర్ రివ్యూ
Advertisement
Ads by CJ

అల్లరి నరేష్-విజయ్ కనకమేడల కలయికలో నాంది లాంటి సూపర్ హిట్ తర్వాత వారి కాంబో నుండి వస్తున్న మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ఉగ్రం. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌ ఉగ్రంపై అంచనాలని పెంచింది. ఈ రోజు శుక్రవారం మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసారు. ట్రైలర్ ఉగ్రం కథాంశాన్ని రివిల్ చేసింది. నగరంలో మిస్సింగ్ కేసుల వెనుక ఉన్న కొంతమంది పవర్ ఫుల్ వ్యక్తులపై నిజాయితీ గల పోలీసు భారీ రిస్క్ తీసుకొని చేసిన పోరాటం ఉగ్రం. అతని కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తారు. అయితే అతను కేసును ఛేదించి, నేరస్థులను పట్టుకోవడానికి మొగ్గుచూపుతాడు.

ట్రైలర్‌లో అల్లరి నరేష్ కొత్తగా, మునుపెన్నడూ చూడని ఫెరోషియస్ పాత్రలో కనిపించారు. ట్రైలర్  రెండవ సగం అతన్ని బ్రూటల్ అవతార్‌లో ప్రజంట్ చేసింది. ట్రైలర్ ఇంటెన్సివ్, గ్రిప్పింగ్, రివిటింగా ఉంది. విజయ్ కనకమేడల నరేష్ పాత్రను ఇంటెన్స్ గా ప్రజంట్ చేయడంతో పాటు  సబ్జెక్ట్‌ని ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. ట్రైలర్‌లో యాక్షన్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌కు స్కోప్ ఉంది. సిద్ టాప్-నాచ్ సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల అద్భుతమైన బీజీఏం గ్రేట్ వాల్యుని జోడించాయి. నరేష్ భార్యగా మిర్నా కనిపించింది.

Ugram Trailer Review:

Allari Naresh Ugram trailer Review

Tags:   UGRAM TRAILER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ