Advertisementt

విక్రమ్ బర్త్ డే స్పెషల్ తంగలాన్

Mon 17th Apr 2023 03:21 PM
thangalaan,chiyaan vikram  విక్రమ్ బర్త్ డే స్పెషల్ తంగలాన్
Thangalaan release glimpsesout విక్రమ్ బర్త్ డే స్పెషల్ తంగలాన్
Advertisement
Ads by CJ

మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ చియాన్ విక్రమ్ కొత్త సినిమాతంగలాన్. పా. రంజిత్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా విక్రమ్ బర్త్ డే స్పెషల్ గా ఓ మేకింగ్ వీడియో గ్లింప్స్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ మూవీ గ్లింప్స్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వారందరికీ నచ్చేలా మేకింగ్ తో పాటు ఓ అద్బుతమైన వీడియో రిలీజ్ చేశారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్(కేజీఎఫ్) నేపథ్యంలో కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా.. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ కోసం విక్రమ్ ఇంతకు ముందెప్పుడూ కనిపించని గెటప్ లో కనిపిస్తున్నాడు. ఈ వీడియో గ్లింప్స్ చూస్తోంటే మూవీ కోసం మొత్తం ఎంతో కష్టపడుతున్నట్టుగా ఉంది. ఈ తరహా చిత్రాల్లో విక్రమ్ ఎప్పుడూ ది బెస్ట్ ఇస్తాడు. అది మరోసారి తంగలాన్ తో కనిపించబోతోందనిపిస్తోంది. 

ప్యాన్ ఇండియన్ సినిమాగా బహుభాషల్లో విడుదల కాబోతోన్న తంగలాన్ లో విక్రమ్ తో పాటు ఫీమేల్ లీడ్స్ లో పార్వతి, మాళవిక మోహనన్ నటిస్తుండగా.. ఓ కీలక పాత్ర కోసం హాలీవుడ్ నటుడు  డేనియల్ కాల్లాగిరోన్ ను తీసుకున్నారు. ఇతర పాత్రల్లో పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై, ప్రీతికరణ్, ముత్తుకుమార్ తో పాటు అనేకమంది ఇతర ప్రముఖులు నటిస్తున్నారు. 

Thangalaan release glimpsesout:

Thangalaan release glimpses of Chiyaan Vikram from the film on his birthday today

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ