2023-24లో ఇండియన్ సినిమా ఆడియన్స్ అత్యంత ఈగర్ గా ఎదురుచూసిన చిత్రాలలో ఒకటి సూర్య42. సూర్య, దిశా పటాని, యోగి బాబు ముఖ్యపాత్రల్లో నటించారు. మాసివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ మూవీకి శివ దర్శకత్వం వహించారు.
సెప్టెంబరు 2022లో ప్రారంభమైన ఈ సినిమా మోషన్ పోస్టర్ వీడియో ఇప్పటికే భారీ హైప్‌ని సృష్టించింది. దీంతో మూవీ టైటిల్ ఏంటా అని అందరూ ఎదురు చూస్తున్నారు.
నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ సూర్య 42 చిత్రానికి కంగువ అనే టైటిల్‌ను ప్రకటించింది. కంగువ అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి మరియు అత్యంత పరాక్రమవంతుడు అని అర్థం. 3డిలో 10 భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకి అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా కామన్ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. అందుకే అన్ని భాషలకు కంగువ అనే టైటిల్‌ను ఖరారు చేసి ప్రకటించారు.
ఈ సినిమా షూటింగ్ గోవా, చెన్నైతో పాటు పలు లొకేషన్లలో జరుగుతోంది. ఇప్పటికే 50 శాతం పూర్తయ్యింది. మరో నెలలో బ్యాలన్స్ షూటింగ్ పూర్తి చేయనున్నారు.
3Dలో ఈ యాక్షన్ మూవీ వివిధ అవతారాలలో మోస్ట్ పవర్ఫుల్ గా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు, అధిక స్థాయిలో విఎఫ్ఎక్స్, CGI వర్క్ ఎక్కువగా ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే 2024 ప్రారంభంలో విడుదల చేసేలా ప్లాన్ చేశారు. షూటింగ్ పూర్తయిన తర్వాత ఖచ్చితమైన విడుదల తేదీని ప్రకటిస్తారు.
నిర్మాత స్టూడియో గ్రీన్ రేంజ్ కి తగ్గట్టుగా అన్ని రకాల మీడియం లో గ్రాండ్ గా ఈ టైటిల్ ను ప్రకటించింది. ఈ టైటిల్‌పై దర్శకుడు శివ మాట్లాడుతూ.. సూర్య 42వ చిత్రం కంగువ అనే టైటిల్‌ను ప్రకటించడం ఆనందంగా ఉంది. సూర్య చాల గంభీరంగా తెరపై కనిపిస్తాడు. ఇది మాకు గుర్తుండిపోయే, ప్రత్యేకమైనది. సినిమా ప్రేమికులకు అద్భుతమైన అనుభూతినిస్తుంది. సినిమా షూటింగ్ పూర్తి చేసి, విడుదల తేదీని వీలైనంత త్వరగా ప్రకటిస్తాం అని చెప్పారు.