Advertisementt

ఉస్తాద్ భగత్ సింగ్ యాక్షన్ షెడ్యూల్ ఫినిష్

Sat 15th Apr 2023 12:11 PM
ustaad bhagat singh,pawan kalyan  ఉస్తాద్ భగత్ సింగ్ యాక్షన్ షెడ్యూల్ ఫినిష్
It's a wrap for the first schedule of Ustaad Bhagat Singh ఉస్తాద్ భగత్ సింగ్ యాక్షన్ షెడ్యూల్ ఫినిష్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్‌తో మాస్ ఎంటర్‌టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం చేతులు కలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ప్రధాన తారాగణం, ఇతర ముఖ్య నటీనటులపై తెరకెక్కించిన కీలక సన్నివేశాలతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ వారంలో ముగిసింది.

ఎనిమిది రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌లో మేకర్స్ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ వెయ్యి మంది కి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు

మరియు పలువురు పిల్లలతో వినోదభరితమైన సన్నివేశాలు తెరకెక్కించారు. అలాగే రొమాంటిక్ సన్నివేశాలను, భారీగా రూపొందించిన పోలీస్ స్టేషన్ సెట్‌లో మరికొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.నాయిక శ్రీలీల తో పాటు నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి పలువురు నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు.

మొదటి షెడ్యూల్‌లో చిత్రీకరించిన సన్నివేశాల పట్ల చిత్ర బృందం ఎంతో సంతృప్తిగా ఉంది. బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం అంచనాలకు మించి అలరిస్తుందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. దర్శకుడు హరీష్ శంకర్ ప్రీ-ప్రొడక్షన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అదిరిపోయే డైలాగ్స్ మరియు స్పెల్-బైండింగ్ మ్యానరిజమ్‌లతో పవన్ కళ్యాణ్‌ను విభిన్న కోణంలో చూపించి ప్రేక్షకులకు విందు అందించడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ స్టైలిష్ పోస్టర్లు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలతో నిండిన కథతో ఈ చిత్రం భారీస్థాయిలో రూపొందుతోంది.

It's a wrap for the first schedule of Ustaad Bhagat Singh:

It's a wrap for the first schedule of Pawan Kalyan Ustaad Bhagat Singh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ