Advertisementt

భగీరధకు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం

Fri 31st Mar 2023 02:29 PM
bhageeradha,telugu university  భగీరధకు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం
Bhageeradha was honored by the Telugu University భగీరధకు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం
Advertisement

ఎన్. టి. ఆర్ శత జయంతి సంవత్సరంలో ఆయన మీద నేను వ్రాసిన మహానటుడు, ప్రజానాయకుడు - ఎన్ .టి .ఆర్ అన్న పుస్తకానికి ఎన్ .టి రామారావు గారు నెలకొల్పిన తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారం అందుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది అన్నారు భగీరధ. 

రచయిత్రి, మహిళాభ్యుదయం కోసం జీవితమంతా కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రతిభాశీలి శ్రీమతి ఇల్లిందల సరస్వతీ దేవి, ఆమె భర్త సీతారామారావు పేరు మీద విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన జీవిత చరిత్రలు విభాగంలో భగీరధకు ఈ అవార్డును ప్రదానం చేశారు. 

తెలుగు విశ్వవిద్యాలం లోని డాక్టర్ ఎన్. టి. ఆర్ కళామందిరం లో బుధవారం రోజు ఉపాధ్యక్షులు ప్రొ. టి. కిషన్ రావు గారు, ఆచార్య భట్టు రమేష్ గారు, రింగ్ రామమూర్తి గారి సమక్షంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఆయాచితం శ్రీధర్ గారు ఈ కీర్తి పురస్కారాన్ని బహుకరించారు. 

ఎన్. టి. రామారావు శత జయంతి సందర్భంగా ఇది మూడవ అవార్డు. ఎన్. టి. రామారావు గారితో భగీరధకు 1977 నుంచి పరిచయం వుంది, రామారావు నటుడుగా వున్నప్పుడు, ముఖ్యమంత్రి అయిన తరువాత. పది ఇంటర్వ్యూలు భగీరధ చేశారు. రామారావు గారి జీవితంపై మహానటుడు, ప్రజానాయకుడు - ఎన్ .టి .ఆర్ పుస్తకాన్ని 18 రోజుల్లో వ్రాశారు. మే 28, 2022న ఈ పుస్తకాన్ని రామారావు గారి పెద్ద కుమార్తె లోకేశ్వరి, రెండవ కుమార్తె పురందేశ్వరి ఆవిష్కరించారు.

Bhageeradha was honored by the Telugu University:

Bhageeradha Telugu University Award

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement