Advertisementt

రచయిత భగీరథకు PSTU కీర్తి పురస్కారం

Thu 23rd Mar 2023 07:20 PM
jaournlist bhagiradha  రచయిత భగీరథకు PSTU కీర్తి పురస్కారం
Bhagiradha was awarded the Telugu University Merit Award రచయిత భగీరథకు PSTU కీర్తి పురస్కారం
Advertisement
Ads by CJ

నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భగా సీనియర్ జర్నలిస్టు వ్రాసిన మహానటుడు, ప్రజానాయకుడు - ఎన్.టి.ఆర్ అన్న పుస్తకానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారం ప్రకటించింది. గురువారం నాడు  ఉపాధ్యక్షులు టి. కిషన్ రావు భగీరధను కలిశారు. 

జీవిత చరిత్ర విభాగంలో మహానటుడు, ప్రజానాయకుడు - ఎన్.టి ఆర్ పుస్తకాన్ని ఎంపిక చేసినట్టు రచయిత భగీరథకు కిషన్ రావు స్వయంగా తెలిపారు. 

ఈ అవార్డు ప్రదానోత్సవం ఈ నెల 29న తెలుగు విశ్వ విద్యాలయంలో జరుగుతుంది

ఇప్పటికే మహానటుడు, ప్రజానాయకుడు - ఎన్.టి.ఆర్ పుస్తకానికి కమలాకర కళాభారతి మరియు  ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ ఎన్.టి.ఆర్ అవార్డులు లభించాయి. 

ఎన్.టి.రామారావు నెలకొల్పిన తెలుగు విశ్వవిద్యాలయం నుంచి.. ఎన్.టి.ఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంలో ఎన్.టి.రామారావు జీవితం మీద వ్రాసిన ఈ పుస్తకానికి ఎన్.టి.ఆర్. కీర్తి పురస్కారం లభిస్తుందని ఊహించలేదంటూ భగీరథ ఆనందం వ్యక్తం చేసారు.

Bhagiradha was awarded the Telugu University Merit Award:

Jaournlist Bhagiradha was awarded the Telugu University Merit Award

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ