Advertisementt

దసరా ట్రైలర్ రిలీజ్

Tue 14th Mar 2023 07:38 PM
nani,dasara trailer  దసరా ట్రైలర్ రిలీజ్
Dasara Trailer release దసరా ట్రైలర్ రిలీజ్
Advertisement
Ads by CJ

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా దసరా థియేట్రికల్ ట్రైలర్‌ను ఈరోజు లక్నోలోని ప్రతిభా థియేటర్‌లో మేకర్స్ విడుదల చేశారు. రెండు నిమిషాల 14 సెకెండ్ల  ట్రైలర్ మాసీవ్ ఇంటెన్స్ యాక్షన్, ఎమోషన్స్, టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్, యూనిక్ బ్యాక్డ్రాప్, అత్యున్నత నిర్మాణ విలువలతో ఎక్స్ టార్డీనరీగా సాగింది. ధరణి (నాని) పాత్రను టీజర్ ప్రజంట్ చేస్తే..  థియేట్రికల్ ట్రైలర్‌ లో అన్ని ప్రముఖ పాత్రలు, వారి పాత్ర లక్షణాలను పరిచయం చేయడంతో పాటు, సినిమా నేపధ్యాన్ని ఆసక్తికరంగా ప్రజంట్ చేశారు. ధరణి మద్యానికి బానిస. బతుకుదెరువు కోసం రైళ్లలో బొగ్గు దొంగిలిస్తుంటాడు. జీవితం సాఫీగా సాగిపోతున్నప్పుడు ఒక సంఘటన తనకి కష్టాలను తెచ్చిపెడుతుంది. దీంతో ధరణి పవర్ ఫుల్ వ్యక్తులపై తిరగబడాలని నిర్ణయించుకుంటాడు.

బతుకమ్మ పాట వినిపించిన తర్వాత ‘వెన్నెలొచ్చిందిరా అనే నాని వాయిస్ ఓవర్ తో వెన్నెలగా కీర్తి సురేష్ పరిచయమైయింది. వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ అద్భుతంగా వుంది.  ట్రైలర్‌లో ఓపెనింగ్,  ముగింపు ఎపిసోడ్‌లో కీర్తి సురేష్ కనిపించడం ఆసక్తిని కలిగించింది. ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

‘దసరా’ అంటే నాని షో అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధరణి పాత్ర కోసం నాని ఎక్స్ టార్డీనరీగా మేకోవర్ అయ్యారు. రస్టిక్ రగ్గడ్‌గా కనిపించారు. బాడీ లాంగ్వేజ్ నుండి డిక్షన్,  యాక్షన్, క్యారెక్టర్ లోని ఎలిమెంట్స్ ఇలా అన్నీ అద్భుతమైన యీజ్ తో చేశారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో మైండ్ బ్లోయింగ్ అనిపించారు. ట్రైలర్ లో చాలా గూస్ బప్స్ మూమెంట్స్ వున్నాయి. నాని స్క్రీన్ ప్రెజెన్స్ అత్యద్భుతంగా ఉంది.

బలమైన కథతో పాటు ట్రైలర్ సూచించినట్లుగా చాలా అంశాలు, మలుపులు, అంతర్లీన భావోద్వేగాలు, డ్రామా మిళితమై వున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో అసాధారణ ప్రతిభ కనబరిచారు. అతని టేకింగ్ ఎక్స్ టార్డీనరీగా వుంది. దసరా అతని మొదటి చిత్రంగా అనిపించలేదు. మాస్ అలరించే సన్నివేశాలు, డైలాగ్స్ చాలా వున్నాయి.

Dasara Trailer release :

Nani Dasara Trailer

Tags:   NANI, DASARA TRAILER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ