"కీరవాణి గారు ఆస్కార్ అందుకోవటం.. నాకు వచ్చినంత ఆనందంగా వుంది.. నేను కుటుంబంలో పెద్దగా.. ప్రమోషన్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని, నేను అన్న సందర్బం వేరు, జాగ్రత్త చెప్పాను తప్ప వేరే ఉద్దేశం లేదు. మావాళ్ళకు పేరు ప్రతిష్ట వస్తుంటే నాకన్నా ఆనంద పడేవాడు ఎవ్వరూ ఉండరు.. ఇది నా కుటుంబం, మా కుటుంబం మద్యలో ఎవ్వడో వేలు పెట్టి ఏదో లబ్ది పొందాలని చూసినా.. మా కుటుంబంలో ఏవ్వరూ పట్టించుకోరు. నా గురించి వాళ్ళకు తెలుసు.. మా వాళ్ళుకు ఆస్కార్ వచ్చింది..💪 మరొక్క సారి రాజమౌళికి, కీరవాణి గారికి, చంద్రబోస్ కు, మరియు ఆర్.ఆర్.ఆర్ టీమ్ కు అభినందనలు..💐 -తమ్మారెడ్డి భరద్వాజ."
తమ్మారెడ్డి ఈమధ్యన ఓ ఈవెంట్ లో ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చుపెట్టుడుతున్నారు, అదే డబ్బుతో నేను పది సినిమాలు తీస్తాను అంటూ చిన్న సినిమాల బడ్జెట్స్ విషయంలో డిబేట్ జరుగుతన్న సమయంలో చెప్పిన చాలా మాటలకి.. ఇండస్ట్రీలో కొందరు ప్రముఖులు ఈ ఒక్క మాటను పట్టుకొని తలా ఒక విధంగా స్పందిస్తూ తమ్మరెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడడం, దానికి ఆయన రియాక్ట్ అవడం చూసాం. తెలుగు వాడికి వచ్చే గౌరవానికి అడ్డం పడే ఉద్దేశ్యం తనకి లేదు అంటూ నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వచ్చిన సందర్భంగా అయన టీమ్ మొత్తానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు.