Advertisementt

బాలయ్య చెయ్యి పట్టుకుని ఎంటరయిన శ్రీలీల

Thu 09th Mar 2023 06:29 PM
sreeleela,nandamuri balakrishna,anil ravipudi,nbk108  బాలయ్య చెయ్యి పట్టుకుని ఎంటరయిన శ్రీలీల
Sreeleela Joins The Shoot Of NBK108 బాలయ్య చెయ్యి పట్టుకుని ఎంటరయిన శ్రీలీల
Advertisement
Ads by CJ

నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్ #NBK108. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న నటి శ్రీలీల ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయింది. ఈ సందర్భంగా శ్రీలీల, బాలకృష్ణ చేయి పట్టుకున్నట్లుగా వున్న బ్యూటీఫుల్ స్టిల్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

బాలకృష్ణ మునుపెన్నడూ చూడని పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. #NBK108లో బాలకృష్ణ మార్క్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి

#NBK 108లో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. బాలకృష్ణ గత రెండు సినిమాలకు సంగీతం అందించిన ఎస్ థమన్ #NBK108కి సంగీతం సమకూరుస్తున్నారు. బాలకృష్ణ, అనిల్ రావిపూడి, ఎస్ థమన్ ల పవర్ ఫుల్ కాంబినేషన్ లో సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ షైన్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ చిత్రం చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా వుంది.  

Sreeleela Joins The Shoot Of NBK108:

Sreeleela Joins The Shoot Of Nandamuri Balakrishna, Anil Ravipudi NBK108

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ