Advertisementt

తారకరత్న నాకు ఆత్మీయుడు:మోహన్ బాబు

Sun 19th Feb 2023 04:08 PM
manchu mohan babu,taraka ratna  తారకరత్న నాకు ఆత్మీయుడు:మోహన్ బాబు
Tarakaratna is very dear to me: Manchu Mohan Babu తారకరత్న నాకు ఆత్మీయుడు:మోహన్ బాబు
Advertisement
Ads by CJ

                  నందమూరి తారకరత్న మరణ వార్త విని నిజంగా షాక్ అయ్యాను. మనసంతా కలచివేసినట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం నేను లండన్ లో, విష్ణు సింగపూర్ లో  ఉండటం వల్ల వ్యక్తిగతంగా  రాలేకపోతున్నాము. నా అన్న నందమూరి తారక రామారావు గారి మనవడు అయిన  తారకరత్న నాకూ, నా కుటుంబానికి చాలా ఆత్మీయుడు. తారకరత్న ఎంత మంచివాడో, ఎంత సౌమ్యుడో, స్నేహశీలో చెప్పటానికి నాకు మాటలు  రావడం లేదు. టీవీల్లో అతని మరణ వార్తకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూస్తుంటే బాధతో గుండె తరుక్కుపోతుంది. 

తారకరత్న మరణం ఒక్క నందమూరి కుటుంబానికే  కాదు.. యావత్ తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన  ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేసారు మంచు మోహన్ బాబు.

Tarakaratna is very dear to me: Manchu Mohan Babu:

Manchu Mohan Babu Drops An Emotional Post Reminiscing Taraka Ratna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ