Advertisementt

తారకరత్న మృతి: ప్రముఖుల సంతాపం

Sun 19th Feb 2023 09:41 AM
nandamuri tarakaratna  తారకరత్న మృతి: ప్రముఖుల సంతాపం
Death of Tarakaratna: Celebrities mourn తారకరత్న మృతి: ప్రముఖుల సంతాపం
Advertisement
Ads by CJ

నందమూరి తారకరత్న నిన్న శనివారం రాత్రి బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రాణాలతో పోరాడుతూ ఆరోగ్యంగా తిరిగివస్తాడని ఆశించినవారు తారకరత్న మరణ వార్త విని తట్టుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ తారకరత్న మృతికి సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ వేశారు. మెగాస్టార్ చిరు, మహేష్ బాబు, రవితేజ, బాలకృష్ణ, సాయి తేజ్, వరుణ్ తేజ్ ఇలా ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు.

తారకరత్న మా కుటుంబానికి విషాదం మిగిల్చి వెళ్ళిపోయాడు: టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు 

నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు. 23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న... చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

పవన్ కళ్యాణ్ 

నటుడు శ్రీ నందమూరి తారకరత్న కన్నుమూయడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. గత మూడు వారాలుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తారకరత్న కోలుకొంటారని భావించాను. ఆయన నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకొన్నారు. ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరం. శ్రీ తారకరత్న భార్యాబిడ్డలకి, తండ్రి శ్రీ మోహనకృష్ణ గారికి, బాబాయి శ్రీ బాలకృష్ణ గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. 

కింజరాపు అచ్చెన్నాయుడు

సినీనటుడు, టీడీపీ యువకెరటం నందమూరి తారకరత్న ఇక లేరన్న వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా ఉండే తారకరత్న మృతి చెందారన్న మాట కోట్లమంది అభిమానులు, కార్యకర్తలు, పార్టీకి తీరని లోటు. చిన్న వయసులోనే గుండెపోటుతో పోరాడి స్వర్గస్తులయ్యారు. తిరిగి వస్తారనుకున్న తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లాడన్నది నమ్మలేక పోతున్నాం. తారకరత్న ఆత్మకు శాంతి కలిగించాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నా. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.

విజయసాయిరెడ్డి

తారకరత్న సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నామని విజయసాయి వెల్లడించారు. కానీ విధి మరోలా తలచిందని విచారం వ్యక్తం చేశారు. నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నానంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. తారకరత్న అభిమానులకు ప్రగాఢ సానభూతి తెలియజేస్తున్నట్టు వెల్లడించారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

సినీ నటుడు, ఎన్టీఆర్‌ మనవడు నందమూరి తారకరత్న మృతి పట్ల ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నారా లోకేష్‌

బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించ‌దు. నేనున్నానంటూ నా వెంట న‌డిచిన ఆ అడుగులు చ‌ప్పుడు ఆగిపోయింది. నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువ‌తేజం తార‌క‌ర‌త్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటు. నిష్క‌ల్మ‌ష‌మైన నీ ప్రేమ‌, స్నేహ బంధం మ‌న బంధుత్వం కంటే గొప్ప‌ది. తార‌క‌ర‌త్న‌కి క‌న్నీటి నివాళులతో.

నందమూరి రామకృష్ణ.

దివికేగిన ధ్రువతార…మా తారకరత్న భౌతికంగా మా మధ్యలేకపోయినావారి ప్రేమ అనురాగం మా హృదయాలలో ఎల్లపుడు చిరస్థాయిగా ఉంటాయి.…వారి ఆత్మకు శాంతిచేకూరాలని పరమేశ్వరిని ప్రార్ధిస్తున్నాము….

అలీ  

ప్రముఖ నటుడు అలీ.. తారకరత్న శివేకం చెందడం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. తారకరత్న సినీ కెరీర్ ప్రారంభం నుంచి అలీ గారితో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. తారకరత్నతో అలీ నాలుగు చిత్రాల్లో కలిసి నటించారు.  తారకరత్న చివరి పెద్ద సినిమా ఎస్ 5 చిత్రంలో కూడా అలీ నటించారు. తనకు ఎంతో సన్నిహితుడైన తారకరత్న ఇలా అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం తన మనసును తీవ్రంగా కలచవేసింది అని అలీ బాధ పడుతూ చెప్పారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని అలీ వేడుకున్నారు.

Death of Tarakaratna: Celebrities mourn:

Nandamuri Taraka Ratna passes away

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ