Advertisementt

మాధవే మధుసూదనా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన నాగార్జున

Sat 18th Feb 2023 04:03 PM
madhave madhusudana movie  మాధవే మధుసూదనా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన నాగార్జున
Madhave Madhusudana First Look Motion Poster Releases మాధవే మధుసూదనా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన నాగార్జున
Advertisement
Ads by CJ

బొమ్మ దేవర శ్రీదేవి సమర్పణలో సాయి రత్న క్రియేషన్స్ పతాకంపై తేజ బొమ్మ దేవర, రిషిక లోక్రే జంటగా  బొమ్మ దేవర రామచంద్ర రావు దర్శక, నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమానికి హీరో నాగ చైతన్య ముఖ్య అతిథిగా వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలు పెంచేశారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్‌ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయించారు మేకర్లు.

అనంతరం నాగార్జున మాట్లాడుతూ.. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ బాగుందని, అందరినీ మెప్పించేలా ఉందని ప్రశంసించారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

ఇక ఈ మోషన్ పోస్టర్‌లో సంగీతం, ఆర్ఆర్ వినసొంపుగా ఉంది. చూస్తుంటే.. ఈ సినిమాలో అందమైన ప్రేమ కథను తెరపై ఆవిష్కరించబోతోన్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాకు వికాస్ బాడిస అందించిన సంగీతం మేజర్ హైలెట్ అవ్వనున్నట్టుగా కనిపిస్తోంది. వాసు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. ఉద్దవ్ ఎస్ బి ఈ సినిమాకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్లు ప్రకటించనున్నారు.

నటీ నటులు: తేజ బొమ్మ దేవర, రిషిక లోక్రే, జయ ప్రకాష్,  శైలజా ప్రియ, మెకా రామకృష్ణ, నవీన్ నేని, రవి శివ తేజ, మాస్టర్ అజయ్, అంజలి, శ్రీ లత తదితరులు

సమర్పణ: బొమ్మ దేవర శ్రీదేవి, బ్యానర్: సాయి రత్న క్రియేషన్స్, రచన దర్శకత్వం: చంద్ర, నిర్మాత: బొమ్మ దేవర రామచంద్ర రావు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: వాసు, సంగీతం: వికాస్ బాడిస, ఎడిటింగ్: ఉద్దవ్ ఎస్ బి, మాటలు: బి సుదర్శన్, కొరియోగ్రఫీ: రాజు సుందరం - బృంద, పాటలు: శ్రీమణి, అనంత శ్రీరామ్, శ్రీ సిరాగ్, కో డైరెక్టర్: వాయుపుత్ర, పి. ఆర్. ఓ:  పర్వతనేని రాంబాబు, సాయి సతీష్, పబ్లిసిటీ డిజైనర్: డ్రీమ్ లైన్, ఎక్సగ్యూటివ్ ప్రొడ్యూసర్: మానుకొండ మురళీకృష్ణ.

Madhave Madhusudana First Look Motion Poster Releases:

King Akkineni Nagarjuna Releases Madhave Madhusudana First Look Motion Poster

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ